News March 19, 2025

వైసీపీకి మర్రి రాజశేఖర్‌ రాజీనామా

image

YCPకి MLC మర్రి రాజశేఖర్‌ రాజీనామా చర్చనీయాంశమైంది. 2004లో చిలకలూరిపేటలో ఇండిపెండెంట్‌గా గెలిచిన ఆయన 2010లో YCPలో చేరారు. 2014లో MLAగా పోటీచేసి ఓడిపోయారు. అనంతరం YCP జిల్లా అధ్యక్షుడిగా పని చేశారు. 2018లో జగన్‌ పాదయాత్రలో కీలకంగా పనిచేశారు. కాగా 2024 ఎన్నికల్లో ఆయనకు టికెట్ దక్కలేదు. ప్రస్తుతం నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా విడదల రజనీ ఉన్నారు. పార్టీలో గుర్తింపు లేదని ఆయన అసంతృప్తిలో ఉన్నట్లు సమాచారం.

Similar News

News September 12, 2025

నాగార్జున యూనివర్సిటీలో క్యాంపస్ డ్రైవ్

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఆధ్వర్యంలో శుక్రవారం క్యాంపస్ డ్రైవ్ నిర్వహించారు. సైన్స్, ఇంజినీరింగ్ కళాశాలల్లోని వివిధ ల్యాబ్‌లలో ఈ కార్యక్రమం జరిగింది. ఎమ్మెస్సీ బయోటెక్నాలజీ, మైక్రో బయాలజీ, బయో కెమిస్ట్రీ కోర్సుల విద్యార్థులకు క్యాంపస్ డ్రైవ్‌లో పాల్గొనే అవకాశం కల్పించారు. ఈ నెల 16, 17 తేదీల్లో విద్యార్థులకు ఇంటర్వ్యూలు జరుగుతాయని వర్సిటీ అధికారులు తెలిపారు.

News September 12, 2025

తెనాలి: ఆయేషా మీరా తల్లిదండ్రులకు CBI నోటీసులు

image

ఆయేషా మీరా హత్య కేసులో ఆమె తల్లిదండ్రులకు సీబీఐ నోటీసులు పంపింది. ఈ నెల 19న విజయవాడ సీబీఐ కోర్టులో హాజరు కావాల్సిందిగా నోటీసులలో పేర్కొంది. దీనిపై ఆయేషా మీరా తల్లిదండ్రులు శంషాద్ బేగం, ఇక్బాల్ భాష ఆవేదన వ్యక్తం చేస్తూ నోటీసులను తిరస్కరించారు. 18 ఏళ్లుగా న్యాయం కోసం పోరాడుతున్నామని, బాధితులైన తమను ఎన్నిసార్లు కోర్టుకు తిప్పుతారని తల్లి శంషాద్ బేగం వాపోయారు.

News September 12, 2025

ANUలో ఏపీ పీజీ సెట్ విద్యార్థులకు ఇబ్బందులు

image

ఏపీ పీజీ సెట్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌లో ఆలస్యం విద్యార్థులను ఇబ్బందులకు గురి చేసింది. ప్రత్యేక కేటగిరీ అభ్యర్థులను గురువారం పెదకాకానిలోని నాగార్జున విశ్వవిద్యాలయానికి పిలిచినా, తీరా చివరి నిమిషంలో వాయిదా వేశారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వందలాది మంది విద్యార్థులు నిరాశ చెందగా, అధికారులు కేవలం పేర్లు, హాల్ టికెట్ వివరాలు మాత్రమే నమోదు చేశారు. ఈ నిర్లక్ష్యంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.