News March 19, 2025
కర్నూలు: లంచం కోసం ఎస్ఐ అరాచకం.. మంగళసూత్రం తాకట్టు పెట్టించి..!

ఆస్పరి SI వెంకట నరసింహులు సస్పెన్షన్‌కు గురయ్యారు. చిత్తూరు జిల్లా సోమల పీఎస్‌లో పనిచేస్తున్న సమయంలో ఓ మహిళ నుంచి లంచం తీసుకున్న ఘటనలో సస్పెండ్ చేశారు. 2023లో ఓ మహిళ అదృశ్యమవ్వడంతో భర్త ఫిర్యాదు చేశారు. మరుసటి రోజు ఆమె స్టేషన్‌కు చేరుకుని తన భర్తతో కలిసి ఉంటానని చెప్పింది. అందుకు ఎస్ఐ రూ.లక్ష డిమాండ్ చేసి, మంగళ సూత్రాన్ని తాకట్టు పెట్టించాడు. దీనిపై విచారణ జరిపిన అధికారులు ఆయనను సస్పెండ్ చేశారు.
Similar News
News March 19, 2025
జగిత్యాల: 22న పీడీఎస్ బియ్యం బహిరంగ వేలం

జగిత్యాల జిల్లాలో అక్రమంగా తరలిస్తుండగా వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న పీడీఎస్ బియ్యానికి ఈనెల 22న బహిరంగవేలం నిర్వహిస్తున్నట్లు జిల్లా పౌరసరఫరాల అధికారి జితేందర్ రెడ్డి తెలిపారు. ఆసక్తి గలవారు రూ.3000 టెండర్ ఫీజు, రూ.2 లక్షల ధరావత్ పౌర సరఫరాల అధికారి జగిత్యాల పేరు మీద డీడీ తీసి ఆధార్, పాన్‌కార్డు ప్రతులను DDతో సహా సమర్పించాలన్నారు. పూర్తివివరాలకు జిల్లా పౌరసరఫరాల కార్యాలయంలో సంప్రదించాలన్నారు.
News March 19, 2025
17 మంది మృతి.. J&K ప్రభుత్వం కీలక ప్రకటన

జమ్మూకశ్మీర్‌లో 3 కుటుంబాల్లోని 17 మంది అనుమానాస్పదంగా <<15242949>>మృతి చెందడంపై<<>> అసెంబ్లీలో ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. వారి శరీరాల్లో 6 రకాల విషపదార్థాలు(అల్యూమినియం, కాడ్మియం, ఆల్డికార్బ్ సల్ఫేట్, ఎసిటామిప్రిడ్, డైథైల్డిథియోకార్బమేట్, క్లోర్ఫెనాపైర్) ఉన్నట్లు పరిశోధనల్లో వెల్లడైందని తెలిపింది. బాక్టీరియల్, వైరల్ సంబంధిత వ్యాధులుగా నిర్ధారణ కాలేదంది. కేసు దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొంది.
News March 19, 2025
భూపాలపల్లి: లింగ నిర్ధారణ పరీక్షలు చట్టరీత్యా నేరం: డీఎంహెచ్‌వో

లింగ నిర్ధారణ పరీక్ష చట్టరీత్యా నేరమని పరీక్ష చేయించిన వారు, చేసిన వారు, ప్రోత్సహించిన వారు, శిక్షార్హులు అవుతారని డీఎంహెచ్‌వో డా.మధుసూదన్ స్పష్టం చేశారు. ఆయన బుధవారం జిల్లా కేంద్రంలోని వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జిల్లా అడ్వైజరీ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎవరైనా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే 94405 86982 నంబరుకు సమాచారం అందించాలని సూచించారు. వైద్యులు పాల్గొన్నారు.