News March 19, 2025

దోచిన సొత్తును శ్మశానంలో దాచేవాడు: ఖమ్మం సీపీ

image

చాట్రాయి(M) చిత్తాపూర్‌కు చెందిన సురేందర్ దొంగతనాలు చేయడంలో టెక్నాలజీని ఉపయోగించాడని ఖమ్మం సీపీ సునీల్ దత్ మంగళవారం తెలిపారు. Google MAP ద్వారా సురేందర్ ఇంటిని మార్క్ చేసి, కొల్లగొట్టి, దొంగలించిన సొత్తును శ్మశానంలో దాచుకున్నాడని చెప్పారు. సదరు నిందితుడి నుంచి 461.19 గ్రాముల బంగారం, 425 గ్రాముల వెండి, రూ.3.32లక్షలు సీజ్ చేశామన్నారు. గత 3 నెలల్లో ఏలూరు, ప.గో.జిల్లాల్లో 43 కేసులు నమోదు అయ్యాయన్నారు.

Similar News

News March 19, 2025

క్రేన్ వక్కపొడి: 40KGల బంగారం, 100 KGల వెండి స్వాధీనం?

image

AP: గుంటూరులోని క్రేన్ వక్కపొడి కంపెనీ ఛైర్మన్ కాంతారావు నివాసం, కార్యాలయాల్లో ఐటీ అధికారులు 2 రోజులుగా సోదాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు 40 కేజీల బంగారం, 100 కేజీల వెండి, రూ.18 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈ సంస్థలో భారీగా నల్లధనం చేరుతున్నట్లు ఐటీ శాఖ అనుమానిస్తోంది. లావాదేవీలపై స్పష్టత కోసం కీలక డాక్యుమెంట్లను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.

News March 19, 2025

రోజూ వైట్ రైస్ తింటున్నారా?

image

వైట్ రైస్ కంటే బ్రౌన్ రైస్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని వైద్యులు సూచిస్తున్నారు. ‘బ్రౌన్ రైస్(దంపుడు బియ్యం)లో ఫైబర్, విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధకశక్తిని పెంపొందిస్తాయి. అధిక ఫైబర్ ఉన్న బ్రౌన్ రైస్ ఊబకాయాన్ని నియంత్రిస్తుంది. అలాగే ఇది బ్లడ్‌లో షుగర్ స్థాయులను స్థిరంగా ఉంచడమే కాకుండా మెదడు, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది’ అని తెలిపారు. SHARE IT

News March 19, 2025

KMR: ముగిసిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు

image

ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు ముగిశాయి. మార్చ్‌5 న ప్రారంభమైన ఈ పరీక్షలు బుధవారంతో ముగిశాయి. ఇంటర్ మొదటి సంవత్సరం రసాయన శాస్త్రం, కామర్స్ పరీక్ష జరిగింది. జనరల్ గ్రూప్‌నకు సంబంధించి 7948 మంది పరీక్ష రాయాల్సి ఉండగా 7719 మంది పరీక్షకు హాజరయ్యారు. ఒకేషనల్ విభాగంలో 1865 మంది పరీక్ష రాయాల్సి ఉండగా, 170 మంది పరీక్షకు దూరంగా ఉన్నారని కామారెడ్డి జిల్లా ఇంటర్ నోడల్ అధికారి షేక్ సలాం తెలిపారు.

error: Content is protected !!