News March 24, 2024

తిరుమల: రేపే రూ.300 టికెట్ల విడుదల

image

తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి జూన్ నెల రూ.300 ప్రత్యేక దర్శన కోటా టికెట్లను సోమవారం విడుదల చేయనున్నారు. ఈ మేరకు టీటీడీ ఓ ప్రకటన విడుదల చేసింది. ఉదయం 10 గంటల నుంచి టీటీడీ అధికారిక వెబ్‌సైట్ నుంచి టికెట్లు బుక్ చేసుకోవచ్చు. అలాగే మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలో గదుల బుకింగ్ కోటాను విడుదల చేస్తారు.

Similar News

News March 11, 2026

చిత్తూరు జిల్లా అధికారులు తనిఖీలు చేసేనా?

image

గ్యాస్ డిమాండ్ నేపథ్యంలో చిత్తూరు జిల్లాలో బ్లాక్ మార్కెటింగ్ అరికట్టేలా అధికారులు చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. జిల్లాలో 46 గ్యాస్ ఏజెన్సీల పరిధిలో సుమారు 6లక్షల కనెక్షన్లు ఉన్నాయి. ప్రస్తుతం కమర్షియల్ సిలిండర్ల పంపిణీని నిలిపివేయడంతో గృహ అవసరాల సిలిండర్లని హోటళ్లకు వినియోగిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. అధికారులు గ్యాస్ పక్కదారి పట్టకుండా షాపులపై తనిఖీలు చేయాల్సిన అవసరం ఉంది.

News March 11, 2026

చిత్తూరు: మల్చింగ్ పేపర్ ధరకు రెక్కలు

image

చిత్తూరు జిల్లాలో పలువురు రైతులు మల్చింగ్ పేపర్‌తో సాగుకు ప్రాధాన్యమిస్తున్నారు. టమాటా సాగులోనూ దీనిని విరివిగా ఉపయోగిస్తున్నారు. మిడిల్ ఈస్ట్‌లో యుద్ధం నేపథ్యంలో ముడి సరుకుల ధర పెరగడంతో మల్చింగ్ ధరకు రెక్కలు వచ్చాయి. గతేడాది ఓ రోల్ రూ.2300 ఉండగా ప్రస్తుతం రూ.3 వేల వరకు విక్రయిస్తున్నారు. అధిక ధరలకు విక్రయించకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు రైతులు కోరుతున్నారు.

News March 11, 2026

అమరావతికి వెళ్లిన చిత్తూరు కలెక్టర్

image

సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో నేడు, రేపు కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరగనుంది. ఇందులో భాగంగా చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ మంగళవారం అమరావతికి వెళ్లారు. కలెక్టర్ తిరిగి వచ్చే వరకు జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ ఇన్‌ఛార్జ్ కలెక్టర్‌గా వ్యవహరించనున్నారు. ఈ నెల 13 నుంచి సుమిత్ కుమార్ ప్రజలకు అందుబాటులో ఉండనున్నారు.