News March 19, 2025
తెలంగాణ రాష్ట్ర జట్టు కెప్టెన్‌గా పాలమూరు వాసి

దేశ రాజధాని ఢిల్లీలో జరగనున్న ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ క్రీడలకు తెలంగాణ రాష్ట్ర ఖోఖో మహిళల జట్టు కెప్టెన్‌గా మక్తల్ పట్టణానికి చెందిన పీడీ బి.రూప ఎంపికయ్యారు. ఈ నెల 21 నుంచి 24 వరకు ఢిల్లీలో జరగనున్న ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ క్రీడల్లో ఆమె పాల్గొంటారు. ఎంపికైన రూపను ఉమ్మడి జిల్లా నేతలు, ఆయా పాఠశాలల హెచ్ఎంలు, ఉపాధ్యాయులు, గ్రామస్థులు అభినందించారు. CONGRATULATIONS.
Similar News
News March 19, 2025
తిరుపతి: కప్ కైవసం చేసుకున్న పోలీస్ జట్టు

తిరుపతి తారకరామా స్టేడియంలో జరిగిన మెగా కార్పొరేట్ క్రికెట్ లీగ్ T-20 టోర్నమెంట్‌లో అమర్ రాజా టీంపై పోలీస్ జట్టు ఘనవిజయం సాధించింది. క్రికెట్ ట్రోర్నమెంట్ లో రాఘవులు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు తీసుకున్నారు. ఆరు మ్యాచ్‌లలో 572 పరుగులు సాధించి అతను ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచాడు. ఈ సందర్భంగా తిరుపతి ఎస్పీ హర్షవర్దన్ రాజు వారిని అభినందించారు.
News March 19, 2025
VZM: ZP ఛైర్మన్‌కు మాజీ CM జగన్ పరామర్శ

విజయనగరం జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాస్ రెండో కుమారుడు ప్రణీత్ బాబు బుధవారం మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మాజీ సీఎం వైఎస్ జగన్ ఫోన్‌లో చిన్న శ్రీనును పరామర్శించారు. మృతికి గల కారణాన్ని అడిగి తెలుసుకున్నారు. చిన్న శ్రీను కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లోనే మనోధైర్యంగా ఉండాలంటూ జగన్ ధైర్యం చెప్పారు.
News March 19, 2025
గుంటూరు: మంచినీటి చలివేంద్రం ప్రారంభించిన కలెక్టర్

జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన మంచినీటి చలివేంద్రంను బుధవారం సాయంత్రం కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీ, సంయుక్త కలెక్టర్ ఏ భార్గవ తేజతో కలసి ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎన్ఎస్‌కే ఖాజావలీ, డిప్యూటీ కలెక్టర్ గంగరాజు, కలెక్టరేట్ కార్యాలయం అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.