News March 19, 2025
పాత కార్లు ఉంటే దెబ్బేనా?

వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం. 10 ఏళ్లు పైబడిన డీజిల్, 15 ఏళ్లు పైబడిన పెట్రోల్ వాహనాలను బ్యాన్ చేయాలని యోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నిర్ణయాన్ని అమలు చేస్తే పాత వాహనాలకు ఇంధనం అమ్మరు. ఫిట్‌నెస్ సర్టిఫికెట్ ఇవ్వరు. ఇప్పటికే ఢిల్లీలో నిషేధం అమలవుతోంది. MHతో పాటు మరిన్ని రాష్ట్రాలు ఈ దిశగా అడుగులు వేసే అవకాశం ఉంది.
Similar News
News January 2, 2026
జిల్లాలో ఎరువుల కొరత లేదు: జేడీ

ప్రస్తుత దాళ్వా సీజన్‌లో జిల్లాలో యూరియాతో సహా ఎలాంటి ఎరువుల కొరత లేదని వ్యవసాయ శాఖ జేడీ విజయకుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సీజన్‌కు మొత్తం 35,576 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా, ఇప్పటికే 4,686 టన్నులు సరఫరా చేశామన్నారు. శుక్ర, శనివారాల్లో రైల్వే రేక్ ల ద్వారా మరిన్ని నిల్వలు వస్తున్నాయని వెల్లడించారు. ఎరువుల లభ్యతపై రైతులు ఆందోళన చెందవద్దన్నారు.
News January 2, 2026
Yum! డీల్.. McD, డొమినోస్‌కు గట్టి పోటీ

దేవయాని, సపైర్ సంస్థల విలీనంతో మెక్ డొనాల్డ్స్, డొమినోస్‌కు సంస్థలకు గట్టి పోటీ ఉంటుందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. USA కంపెనీ Yum!కి చెందిన KFC, పిజ్జా హట్‌లను దేశంలో దేవయాని, సపైర్ వేర్వేరుగా నిర్వహిస్తున్నాయి. ఇప్పుడీ $934 మిలియన్ల డీల్‌తో మెర్జర్ ప్రకటించాయి. దీంతో వీటికి మ్యాన్‌పవర్, కార్గో తదితర కాస్ట్ తగ్గి ఆఫర్స్ సహా కొత్త బై ప్రొడక్ట్స్‌తో ప్రత్యర్థులకు కాంపిటీషన్ ఎక్కువ కావచ్చు.
News January 2, 2026
సకల శాఖల విచ్ఛిన్న మంత్రి మిస్సింగ్: YCP

AP: సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ విదేశాల్లో వ్యక్తిగత పర్యటనల్లో ఉన్నారన్న వార్తలపై వైసీపీ కౌంటర్లు వేస్తోంది. ‘అసలు ముఖ్యమంత్రి చంద్రబాబు, సకల శాఖల విచ్ఛిన్న మంత్రి నారా లోకేశ్ ఎక్కడికి వెళ్లారు? ఎక్కడున్నారు? ఆంధ్రప్రదేశ్ ప్రజలు అడుగుతున్నారు’ అంటూ ట్వీట్లు చేసింది. వాళ్లు కనబడుటలేదు అంటూ పోస్టర్లు కూడా క్రియేట్ చేసింది. వారి వ్యక్తిగత పర్యటనపై గోప్యత ఎందుకని YCP నేతలు ప్రశ్నిస్తున్నారు.


