News March 19, 2025

ముకుంద జువెలర్స్ వార్షికోత్సవ వేడుకలు

image

ముకుంద జువెలర్స్ కూకట్‌పల్లి బ్రాంచ్ 2వ వార్షికోత్సవం, కొత్తపేట బ్రాంచ్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా సంస్థ ఉద్యోగులకు బహుమతులు ప్రదానం చేశారు. రెండు సంవత్సరాల్లోనే 6 బ్రాంచులు స్థాపించడం సంతోషంగా ఉందని, కస్టమర్ల నమ్మకమే తమ సంస్థ అభివృద్ధికి దోహదపడుతుందన్నారు. సేల్స్ పెంచిన ఉద్యోగులకు కార్లు, బైకులు, టీవీలు, ఎలక్ట్రానిక్ వస్తువులు బహుమతిగా అందజేశారు.

Similar News

News March 19, 2025

మా పోరాటంతోనే ఎస్సీ వర్గీకరణ చట్టం: మందకృష్ణ

image

మూడు దశాబ్దాల పాటు ఎస్సీ వర్గీకరణపై తాము చేపట్టిన పోరాట ఫలితమే వర్గీకరణకు చట్ట రూపం దాల్చిందని పద్మశ్రీ మందకృష్ణ మాది అన్నారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన క్లబ్‌లో మాట్లాడుతూ.. వర్గీకరణ చట్ట రూపం దాల్చడంతో నెలరోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా సభలు, విజయోత్సవం నిర్వహిస్తామన్నారు. చట్టం మా చేతిలో పెట్టి ఉద్యోగాలన్నీ వారికి దోచి పెట్టారన్నారు.

News March 19, 2025

HYD: వ్యర్థాలను నిల్వ చేసిన వ్యక్తి ARREST

image

మంగళ్‌హాట్‌లోని చమన్‌దర్గా వద్ద దుకాణంలో మాంసపు వ్యర్థాలను నిల్వ చేస్తున్న మహమ్మద్ అఫ్రోజ్ అనే వ్యక్తిని టాస్క్‌ఫోర్స్, సౌత్‌వెస్ట్ జోన్ పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.8 లక్షల విలువైన 12 టన్నుల బరువుగల పాయా, తల, మెదడు, కిడ్నీ, మేక, గొర్రెల లివర్, ఇతర పశువుల మాంసాన్ని గుర్తించి సీజ్ చేశారు. నిందితుడు ఈ వ్యర్థాలను ఎవరెవరికి అమ్ముతున్నారనేది విచారణ తర్వాత చెబుతామని అధికారులు తెలిపారు.

News March 19, 2025

HYD: మంత్రి సీతక్క పేరుతో నకిలీ MLA స్టిక్కర్‌

image

హైదరాబాద్‌ నకిలీ MLA స్టిక్కర్ వేసుకొని సంచరిస్తున్నారు. తాజాగా మంత్రి సీతక్క పేరుతో ఉన్న నకిలీ స్టిక్కర్ వాహనం (TG 09 HT R 1991)THARపై చర్యలు తీసుకోవాలని పంజాగుట్ట పోలీసులకు బుధవారం ఫిర్యాదు అందింది. మంత్రి పీఆర్ఓ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి కార్ సీజ్ చేసినట్లు పంజాగుట్ట పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు కేసు విచారణ జరుపుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

error: Content is protected !!