News March 19, 2025

తుపాకీ చేతబట్టిన తొలి మహిళ మల్లు స్వరాజ్యం

image

తెలంగాణ సాయుధ పోరాటంలో తుపాకీ చేతబట్టిన తొలి మహిళ మల్లు స్వరాజ్యం. తుంగతుర్తి మండలం కొత్తగూడెంలో 1931లో భూస్వాముల కుటుంబంలో పుట్టిన ఆమె నైజాం సర్కార్‌కి వ్యతిరేకంగా పోరాడారు. దొరల దురహంకారంపై తన పాటలతో ప్రజలను చైతన్యపరిచారు. సాయుధ పోరాటంలో తన అన్న భీంరెడ్డి నర్సింహారెడ్డితో కలిసి పోరాడిన ధీరవనిత మల్లు స్వరాజ్యం. 1978, 1983లో తుంగతుర్తి ఎమ్మెల్యేగా గెలిచారు. నేడు మల్లు స్వరాజ్యం 3వ వర్ధంతి.

Similar News

News November 10, 2025

మొంథా తుఫాన్.. 1,64,505 హెక్టార్లలో పంట నష్టం

image

AP: మొంథా తుఫాన్ వల్ల రాష్ట్రంలోని 24 జిల్లాల్లో 1,64,505 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయశాఖ గుర్తించింది. కృష్ణా జిల్లాలో అత్యధికంగా 31వేల హెక్టార్లలో, కోనసీమలో 29,537, కాకినాడలో 21,422 హెక్టార్లలో పంట నష్టం జరిగింది. తుఫాన్ ప్రభావిత 6 జిల్లాల్లో కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి పౌసుమీ బసు నేతృత్వంలోని 8 మంది సభ్యుల బృందం.. ఇవాళ, రేపు పర్యటించి పంట నష్టంపై కేంద్రానికి నివేదిక ఇవ్వనుంది.

News November 10, 2025

పటాన్‌చెరు: సీఐటీయూ జిల్లా కోశాధికారిగా రాజయ్య

image

సీఐటీయూ జిల్లా కోశాధికారిగా రాజయ్యను నియమిస్తున్నట్లు జిల్లా అధ్యక్షుడు మల్లేశం తెలిపారు. రాజయ్య మాట్లాడుతూ.. తనను జిల్లా కోశాధికారిగా నియమించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. పటాన్‌చెరు పారిశ్రామిక ప్రాంతంలో కార్మికుల సమస్యలపై ఆందోళన కార్యక్రమాలు చేస్తామని చెప్పారు. కార్మికుల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటానని పేర్కొన్నారు.

News November 10, 2025

మెగాస్టార్ సినిమాలో తమన్నా స్పెషల్ సాంగ్!

image

స్వింగ్ జరా, కావాలయ్యా వంటి సూపర్‌హిట్ సాంగ్స్‌తో యూత్‌ను అట్రాక్ట్ చేసిన మిల్కీ బ్యూటీ తమన్నా మరోసారి సిల్వర్ స్క్రీన్‌ను షేక్ చేయడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాలో స్పెషల్ సాంగ్ చేయనున్నట్టు టాక్. ప్రత్యేక సెట్‌లో సాంగ్‌ షూట్ చేయడానికి అనిల్ రెడీ అవుతున్నారట. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.