News March 19, 2025
NLG: చేనేత కార్మికులు దరఖాస్తు చేసుకోవాలి

ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డు కోసం అర్హత గల చేనేత కార్మికులకు నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు చేనేత, జౌళి శాఖ సహాయ డైరెక్టర్ ఎస్.ద్వారక్ తెలిపారు. చేనేత, డిజైన్ వృత్తిలో పని చేస్తున్న వారికి ఈ అవార్డు ఇస్తున్నట్లు తెలిపారు. ఎంపికైన వారికీ రూ.10 వేల నగదు పురస్కారంతో పాటు ప్రశంసాపత్రం, జ్ఞాపిక బహుకరిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి ఉన్నవారు ఏప్రిల్ 15వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
Similar News
News March 19, 2025
25న వాక్ ఇన్ ఇంటర్వ్యూలు: కలెక్టర్

NLG ప్రభుత్వ వైద్య కళాశాలలో డాక్టర్ విభాగములో బోధన సిబ్బంది ప్రొఫెసర్ (04), అసోసియేట్ ప్రొఫెసర్ (16), అసిస్టెంట్ ప్రొఫెసర్ (15), సీనియర్ రెసిడెంట్ (12), ట్యూటర్ (13) (తాత్కాలికంగా) పోస్టులకు ఈనెల 25న ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠీ ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాల కోసం https://nalgonda.telangana.gov.in/ & www.gmcnalgonda.in లో పూర్తి వివరాలు ఉన్నట్లు తెలిపారు.
News March 19, 2025
మెట్ట పంటలపై రైతులు దృష్టి సారించాలి: కలెక్టర్

ప్రస్తుతం జిల్లాలో భూగర్భ జలాలు తగ్గడం ద్వారా వరి వేసిన రైతులు ఇబ్బంది పడుతున్నారని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. చిట్యాల మండలంలో కొంతం సత్తిరెడ్డి వ్యవసాయ క్షేత్రం సందర్శించి రైతు సాగు చేస్తున్న పంటల వివరాలను అడిగి తెలుసుకున్నారు. వచ్చే వాన కాలంలో వరి ప్రత్యామ్నాయంగా తక్కువ నీటి వినియోగించుకుని మెట్ట పంటలు, పండ్లు కూరగాయలు సాగుపై రైతులు దృష్టి సారించాలన్నారు.
News March 19, 2025
NLG: రాజకీయ పార్టీలు సహకరించాలి: ఆర్డీవో

ఓటర్ జాబితా ఎప్పటికప్పుడు తాజాగా ఉండేలా చేర్పులు.. మార్పులకు రాజకీయ పార్టీలు సహకరించాలని నల్గొండ RDO అశోక్ రెడ్డి అన్నారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు బుధవారం నల్గొండ ఆర్డీవో కార్యాలయంలో ఆన్‌లైన్లో రోజువారి ఓటర్ నమోదు అవుతున్న ఫామ్ 6,7,8ల పరిష్కారం, డూప్లికేట్ ఓటర్లు తొలగింపు, బూత్ లెవెల్ ఏజెంట్ల నియామకం తదితర అంశాలపై అఖిలపక్ష సమావేశం నిర్వహించారు.