News March 19, 2025

కశింకోట: హత్యకు గురైన ట్రాన్స్‌జెండర్ దీపుగా గుర్తింపు

image

హత్యకు గురైన ట్రాన్స్‌జెండర్‌ అనకాపల్లి పట్టణం గవరపాలెం బోయవీధికి చెందిన దీపు(30)గా గుర్తించారు. ఎంబీఏ చేసిన దిలిప్ కుమార్ దీపుగా మారింది. మూడేళ్ల నుంచి ఓ యువకుడితో సహజీవనం చేస్తున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఆమె మృతదేహంలో సగభాగాన్ని కసింకోట మండలం బయ్యవరం వద్ద మంగళవారం గుర్తించారు. అనకాపల్లి ఇన్‌ఛార్జ్ ఎస్పీ వకుల్ జిందాల్ ఆధ్వర్యంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

Similar News

News July 7, 2025

NZB: శాంతాబాయి కుటుంబానికి సాయం చేయాలని సీఎం ఆదేశం

image

వేల్పూర్ మండలం రామన్నపేటకు చెందిన <<16959274>>80 ఏళ్ల వృద్ధురాలు<<>> శాంతాబాయి, ఆమె ముగ్గురు కుమారులకు CM రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వ నుంచి అవసరమైన తోడ్పాటును అందిస్తామని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. పుట్టుకతోనే అంధులుగా జన్మించిన ముగ్గురు కుమారులకు సపర్యలు చేయడానికి వృద్ధురాలు పడుతున్న ఇబ్బందులపై పలు మీడియాల్లో కథనం ప్రచురించగా ప్రభుత్వం స్పందించింది.

News July 7, 2025

శ్రీకాకుళం IIITలో 149 సీట్లు ఖాళీ

image

శ్రీకాకుళం IIIT క్యాంపస్‌కు సంబంధించి మొదటి విడత సీట్ల భర్తీ పూర్తయ్యింది. మొత్తం 1,010 సీట్లు ఉండగా 867 సీట్లను భర్తీ చేశారు. ఇంకా 149 సీట్లు ఖాళీగా ఉన్నాయి. వీటిని త్వరలో భర్తీ చేయనున్నారు. మెరిట్ ఆధారంగా సీట్లు కేటాయించి ఈనెల 11,12వ తేదీలో రెండో విడత ప్రవేశాల లిస్ట్ విడుదల చేస్తారు. ఈనెల 14న క్లాసులు ప్రారంభమవుతాయి.

News July 7, 2025

‘అనకాపల్లి జిల్లాలో కల్తీ మద్యం.. ఇద్దరు అరెస్ట్’

image

కల్తీ మద్యం తయారు చేస్తూ ఈనెల రెండవ తేదీన పట్టుబడిన నిందితులు రుత్తల రాము, ఎలమంచిలి వెంకటేశ్వరరావును రిమాండ్‌కు తరలించినట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి సుధీర్ తెలిపారు. ఆదివారం అనకాపల్లిలో ఆయన మాట్లాడుతూ.. వీరిద్దరూ కల్తీ మద్యం వ్యాపారాన్ని రెండున్నర ఏళ్ల నుంచి నిర్వహిస్తున్నట్లు విచారణలో తేలిందన్నారు. నిందితుల వెనుక టీడీపీ నేత ఉన్నారని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు.