News March 19, 2025
బడ్జెట్ సమావేశాలు.. భువనగిరి జిల్లాకు GOOD NEWS

యాదాద్రి జిల్లాకు తాగునీరు అందించేందుకు బ్రాహ్మణ వెల్లంల లిప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ప్రారంభించినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. నల్గొండ, భువనగిరి జిల్లాలో 94 గ్రామాల్లో లక్ష ఎకరాలకు సాగు నీరు, ఫ్లోరైడ్ సమస్య ఉన్న 107 గ్రామాలకు తాగునీటిని అందిస్తామని బడ్జెట్ సమావేశాల్లో చెప్పారు. ఉదయ సముద్రం నుంచి 6.70 TMCల నీటిని బ్రాహ్మణ వెల్లంలకు లిఫ్ట్ చేస్తామన్నారు.
Similar News
News March 20, 2025
ఒంగోలు: ఆర్టీసీ బస్సులో మహిళ మృతి.!

RTC బస్సులో మహిళ మృతి చెందిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఒంగోలులో నివాసం ఉంటున్న సాహినా బేగం హైదరాబాదు నుంచి కుటుంబ సభ్యులతో ఒంగోలు వస్తోంది. సంతమాగులూరు వద్దకు వచ్చేసరికి ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్ళింది. కుటుంబ సభ్యులు, ప్రయాణికులు గమనించి అంబులెన్స్‌కు సమాచారం అందించారు. అప్పటికే ఆమె మృతి చెందిందని నిర్ధారించారు.
News March 20, 2025
BREAKING: ఇద్దరు ఎమ్మెల్యేలకు గాయాలు

AP: రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన క్రీడా పోటీల్లో ఇద్దరు MLAలు, ఓ MLC గాయపడ్డారు. రాజమండ్రి రూరల్ MLA గోరంట్ల బుచ్చయ్య చౌదరి కబడ్డీ ఆడుతూ వెనక్కి పడిపోవటంతో తలకు స్వల్పగాయమైంది. అలాగే రైల్వేకోడూరు MLA అరవ శ్రీధర్ కూడా కబడ్డీ ఆడుతూ కిందపడిపోయారు. దీంతో ఆయన కాలు ఫ్రాక్చర్ అయింది. క్రికెట్ ఆడుతూ MLC రాంభూపాల్ రెడ్డి కింద పడిపోయారు. వీరందరినీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
News March 20, 2025
బడ్జెట్ సంబంధిత సమాచారంతో అధికారులు సిద్ధంగా ఉండాలి: మేయర్

బడ్జెట్ సంబంధిత సమాచారంతో అధికారులు సిద్ధంగా ఉండాలని మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. రేపు జరగబోయే 2024-25కు సంబంధించిన బడ్జెట్ సమావేశం నిర్వహణ దృష్ట్యా బుధవారం ప్రధాన కార్యాలయంలో కమిషనర్ అశ్విని తానాజీ వాకడేతో కలిసి బడ్జెట్ అంశాలపై మేయర్ సమీక్షించారు. అధికారులు ఆదాయ వ్యయాలపై అవగాహన కలిగి ఉండి, సభ్యులు అడిగే అంశాలకు సమాధానం ఇచ్చే విధంగా ఉండాలని అన్నారు.