News March 19, 2025

సిద్దిపేట: పరీక్షా కేంద్రాల వద్ద BNSS 163 సెక్షన్ అమలు

image

సిద్దిపేట జిల్లాలో పదవ తరగతి పరీక్షలు జరుగుతున్న 79 కేంద్రాల వద్ద 163 BNSS-2023 సెక్షన్ అమలు చేస్తున్నట్లు సీపీ డాక్టర్ బి. అనురాధ తెలిపారు. ఈ నెల 21 నుంచి వచ్చే నెల 4 వరకు జరిగే పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు సిద్దిపేట్ జిల్లాలోని పరీక్ష కేంద్రాల వద్ద ఆంక్షలు అమలులో ఉంటాయని చెప్పారు. ఎగ్జామ్స్ సెంటర్ సమీపంలోని అన్ని జిరాక్స్ సెంటర్స్ మూసి వేయాలని సూచించారు.

Similar News

News March 2, 2026

SRCL: బాధితుల సమస్యల పరిష్కారమే లక్ష్యం: ఎస్పీ

image

ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించి, వారికి పోలీసు సేవలను మరింత చేరువ చేయడమే తమ లక్ష్యమని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేశ్ బి.గితే పేర్కొన్నారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమంలో ఆయన బాధితుల నుంచి 31 ఫిర్యాదులను స్వీకరించారు. అర్జీదారుల సమస్యలను అడిగి తెలుసుకున్న ఎస్పీ, వాటిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

News March 2, 2026

ఉగాది నాటికి 16,702 ఇళ్ల పూర్తి లక్ష్యం సాధించాలి: జేసీ

image

అనంతపురం కలెక్టరేట్‌లో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్ ఉగాది నాటికి జిల్లాకు కేటాయించిన 16,702 ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు. పీఎం ఆవాస్ యోజన 2.0 కింద మంజూరైన ఇళ్ల గ్రౌండింగ్ వేగవంతం చేయాలన్నారు. ఎన్ఆర్ఈజీఏ బిల్లుల అప్లోడ్, స్వామిత్వం, పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ, సీసీ రోడ్లు, డ్రైన్ల పనుల్లో పురోగతి సాధించాలని సూచించారు.

News March 2, 2026

కామారెడ్డి: ప్రజాస్వామ్య విలువలకు నిలువుటద్దం దుద్దిల్ల

image

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ శాసనసభ స్పీకర్, దివంగత నాయకుడు దుద్దిల్ల శ్రీపాదరావు ప్రజాస్వామ్య విలువలను కాపాడిన మహోన్నత నేత అని కామారెడ్డి జిల్లా అదనపు ఎస్పీ నరసింహ రెడ్డి కొనియాడారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో శ్రీపాదరావు జయంతి వేడుకలను నిర్వహించారు. అదనపు ఎస్పీ, ఇతర పోలీస్ అధికారులతో కలిసి శ్రీపాదరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.