News March 19, 2025
తాండూర్: ఇంటి పన్ను వసూలు 74% జిల్లాలోని చివరి స్థానం

తాండూర్ మండల వ్యాప్తంగా 33 గ్రామపంచాయతీలో నేటి వరకు 74% ఇంటి పన్ను వసూలు అయినట్లు మండల పంచాయతీ అధికారులు తెలిపారు. 33 గ్రామపంచాయతీలో 100% కంటే తక్కువ ఇంటి పన్ను వసూలు అయిందని, మార్చి చివరి నాటికి 100% ఇంటి పన్ను వసూళ్లే లక్ష్యంగా పంచాయతీ కార్యదర్శులు ముమ్మరంగా పని చేయాలని ఇప్పటికే అధికారుల నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. జిల్లాలోనే చివరి స్థానంలో ఇంటి పన్ను వసూళ్లలో తాండూరు మండలం ఉంది.
Similar News
News October 27, 2025
పల్నాడు: ‘రేపు విద్యా సంస్థలకు సెలవు’

జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు, అంగన్‌వాడీ పాఠశాలలు, కళాశాలలకు ఈ నెల 28వ తేదీని సెలవు ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. మొంథా తుఫాను కారణంగా ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా నివారించే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె పేర్కొన్నారు.
News October 27, 2025
HYD: కొమురం భీమ్‌కు బీజేపీ ఘన నివాళులు

గిరిజన వీరుడు కొమురం భీమ్ వర్ధంతి సందర్భంగా ఈరోజు HYD నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కొమురం భీమ్ త్యాగం, ధైర్యం తరతరాలకు ప్రేరణగా నిలుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి అమర్ సింగ్ తిలావత్, Ex MP.ప్రొ.సీతారాం నాయక్, ST మోర్చా అధ్యక్షుడు నేనావత్ రవి నాయక్, పార్టీ నేతలు పాల్గొన్నారు.