News March 19, 2025
పాలకుర్తి: అనారోగ్యం కారణంతో ఆత్మహత్య చేసుకున్న యువకుడు

పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం బసంతనగర్ మారుతినగర్లో మంగళవారం ఆరే అజయ్(23) అనే యువకుడు ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అజయ్ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడని, హాస్పిటల్లో వైద్యం చేయించుకున్నా ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో దీంతో విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నాడని బసంతనగర్ ఎస్సై స్వామి తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని అన్నారు.
Similar News
News September 17, 2025
ఎన్టీఆర్: అమరావతి అసైన్డ్ రైతులకు ఊరట

రాజధాని అమరావతికి భూములిచ్చిన అసైన్డ్ రైతులకు ప్రభుత్వం ఊరటనిచ్చింది. CRDA వీరికిచ్చే రిటర్నబుల్ ఫ్లాట్ల ఓనర్షిప్ సర్టిఫికెట్లో “అసైన్డ్” అనే పదం తొలగించి పట్టా భూమి అనే పేర్కొంటామని బుధవారం ఉత్తర్వులిచ్చింది. ఇటీవల చంద్రబాబును కలసిన రైతులు అసైన్డ్ అని ఉన్న కారణంగా తమ ఫ్లాట్లకు తక్కువ ధర వస్తోందని చెప్పగా..సీఎం చంద్రబాబు ఓనర్షిప్ సర్టిఫికెట్లో మార్పులు చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చారు.
News September 17, 2025
KNR: గంటకు రూ.400 అద్దె.. ఈజీగా 4- 5 ఎకరాలకు

ఏరువాక పనులు ముమ్మరంగా కొనసాగుతుండడంతో జిల్లాలోని రైతులు పొలాల్లో మందుల పిచికారీ కోసం నూతన టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. ఇందుకోసం డ్రోన్లలను ఆశ్రయిస్తున్నారు. రూ.400 అద్దె చెల్లించి గంట వ్యవధిలో 4- 5 ఎకరాలకు సులువుగా పిచికారీ చేస్తున్నారు. దీనికి డిమాండ్ పెరగటంతో డ్రోన్లు దొరకని పరిస్థితి ఏర్పడింది. దీంతో రైతులు శంకరపట్నం, మానకొండూర్, జమ్మికుంట, PDPL జిల్లాల నుంచి వీటిని తెప్పించుకుంటున్నారు.
News September 17, 2025
ఈనెల 19న ఉద్యోగుల కోసం గ్రీవెన్స్: కలెక్టర్

ఈ నెల 19వ తేదీ శుక్రవారం ఉద్యోగుల కోసం ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఎస్.రామసుందర్ రెడ్డి బుధవారం తెలిపారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో ఈ కార్యక్రమంలో వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొంటారని వెల్లడించారు. ఉద్యోగులు తమ సమస్యలపై ఈ గ్రీవెన్స్‌లో ధరఖాస్తులను అందజేయవచ్చునని సూచించారు. ప్రతి 3వ శుక్రవారం కార్యక్రమం జరుగుతుందన్నారు.