News March 19, 2025
VKB: బీజేపీ రాష్ట్ర పార్టీ కార్యాలయానికి చేరిన పంచాయతీ

బీజేపీ జిల్లా పంచాయతీ రాష్ట్ర పార్టీ కార్యాలయానికి చేరుకుంది. వికారాబాద్ నూతన జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి నియామకాన్ని నిరసిస్తూ జిల్లా వ్యాప్తంగా నాయకులు హైదరాబాద్ పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. జిల్లా అధ్యక్షున్ని మార్పు చేసేవరకు పార్టీ ఆఫీసులో నిరసన తెలుపుతామని నాయకులు స్పష్టం చేసినట్లుగా తెలిసింది. రాజశేఖర్ రెడ్డి స్థానికేతరుడు అని, నూతనంగా పార్టీలోకి వచ్చాడని వివాదం కొనసాగుతుంది.
Similar News
News November 16, 2025
కరీంనగర్: ట్రాఫిక్ ఉల్లంఘనలపై కఠిన చర్యలు: సీపీ

తమ కార్యాలయ పరిధిలో కొంతమంది పోలీసులు నెంబర్‌ప్లేట్ లేని వాహనాలు, హెల్మెట్/సీట్‌బెల్ట్ ధరించకపోవడం, బ్లాక్ ఫిల్మ్ వాడటం వంటి ట్రాఫిక్ ఉల్లంఘనలు చేస్తున్నట్లు గుర్తించిన సీపీ, కట్టుదిట్టమైన చర్యలకు ఆదేశించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించేవారికి, పోలీసులు అయినా సరే, కఠినంగా ఈ-చలాన్లు జారీ చేయాలని ఏసీపీ ట్రాఫిక్‌కు ఆయన స్పష్టం చేశారు.
News November 16, 2025
STRANGE: ఈ ఊరిలో 450 మంది ట్విన్స్

ఒక ఊరిలో పది మంది కవలలు ఉంటేనే ఆశ్చర్యంగా చూస్తుంటారు. అలాంటిది 2వేల మంది జనాభా ఉన్న కేరళలోని ‘కొడిన్హి’లో ఏకంగా 450 జతల కవలలు ఉంటే ఇంకెలా ఉంటుంది. అక్కడ కవల పిల్లలు ఎక్కువగా పుట్టడం అంతుచిక్కని విషయంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిశోధకులు, జన్యు శాస్త్రవేత్తలు ఇప్పటికీ నిర్దిష్టమైన కారణాన్ని మాత్రం గుర్తించలేకపోయారు. అయితే వలస వచ్చిన కుటుంబాలకూ కవలలు జన్మించడం విచిత్రం.
News November 16, 2025
పెద్దపల్లి: డిమాండ్లు నెరవేరే వరకు నిరవధిక సమ్మె

PDPL కలెక్టరేట్ వద్ద మధ్యాహ్న భోజనకార్మికులు ధర్నా చేపట్టి ముట్టడి చేశారు. ప్రభుత్వాలు మారినా సమస్యలకు పరిష్కారం లేకపోవడంతో కార్మికుల జీవనం కష్టాల్లో ఉందని జిల్లా ప్రధాన కార్యదర్శి పూసాల రమేష్ ఆవేదన వ్యక్తంచేశారు. నిత్యావసర సరుకులు అందజేయడం, నెలకు ₹10,000 గౌరవవేతనం, పెండింగ్ బకాయిలు చెల్లించడం వంటి డిమాండ్లు వెంటనే నెరవేర్చాలని కోరారు. సమస్యలు పరిష్కారమయ్యే వరకు సమ్మె కొనసాగిస్తామన్నారు


