News March 19, 2025
నారాయణపేట: ఆ విద్యార్థులకు FREEగా శిక్షణ

ప్రత్యేక అవసరాలు గల విద్యార్థుల కోసం భవిత సెంటర్లలో ప్రత్యేక శిక్షణను ఫ్రీగా ఇస్తున్నట్లు కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. నారాయణపేటలోని ఎస్సీ బాలుర వసతి గృహంలో బుధవారం భారత కృత్రిమ అవయవాల నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ఉపకరణాలను పంపిణీ చేశారు. భవిత సెంటర్‌లో దివ్యాంగులకు ఇచ్చే శిక్షణను తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అధికారులు పాల్గొన్నారు.
Similar News
News July 4, 2025
విశాఖ: ఈ ప్రాంతాల్లో M.I.G. అపార్ట్మెంట్ల నిర్మాణం

విశాఖలోని 3 ప్రాంతాల్లో M.I.G. అపార్ట్మెంట్లను V.M.R.D.A. నిర్మించనుంది. మిథిలాపురి వుడా కాలనీ, మారికవలస, వేపగుంటల్లో మధ్యతరగతి కుటుంబాల కోసం 2BHK, 2.5 BHK, 3 BHK అపార్ట్మెంట్లు నిర్మిస్తారు. PPP పద్ధతిలో నిర్మాణానికి బోర్డు ఆమోదం తెలిపిందని ఛైర్మన్ ప్రణవ్ గోపాల్ తెలిపారు. M.I.G. అపార్ట్మెంట్ల నిర్మాణానికి గతంలో డిమాండ్ సర్వే నిర్వహించారు. ఆదరణ లభించడంతో వీటి నిర్మాణానికి నిర్ణయించారు.
News July 4, 2025
GNT: సీలింగ్ భూముల క్రమబద్ధీకరణపై జేసీ సమీక్ష

సీలింగ్ భూములు క్రమబద్ధీకరణ చేసుకోవాల్సిన వారు ఈ ఏడాది డిసెంబర్ 31లోపు దరఖాస్తు చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ ఏ.భార్గవ్ తేజ సూచించారు. కాంపిటెంట్ అథారిటీ, అర్బన్ ల్యాండ్ సీలింగ్స్ అధికారులతో కలిసి తహశీల్దార్‌లు, సర్వేయర్‌లతో గుంటూరు కలెక్టరేట్‌లో జేసీ శుక్రవారం సమీక్ష చేశారు. సీలింగ్ భూముల క్రమబద్ధీకరణ కోసం గతంలో వచ్చిన అర్జీలపై విచారణ జరిపి అధికారులు నివేదికలను సమర్పించాలని ఆదేశించారు.
News July 4, 2025
రాష్ట్రంలో 3 దాడులు.. 6 కేసులు: అంబటి

AP: రాష్ట్రంలో పరిస్థితి మూడు దాడులు.. ఆరు కేసుల మాదిరిగా తయారైందని YCP నేత అంబటి రాంబాబు విమర్శించారు. రోజూ ఎక్కడో ఓ చోట YCP కార్యకర్తలపై దాడులు జరుగుతూనే ఉన్నాయని మండిపడ్డారు. ‘రెడ్ బుక్ కోసం కొందరు అధికారులు, రిటైర్డ్ ఆఫీసర్లు కలిసి పని చేస్తున్నారు. పోలీసులు ఈ దాడులను ఆపటం లేదు. ఎవరు చంపుకున్నా YCP నేతలపైనే కేసులు పెడుతున్నారు. కూటమి సర్కార్ తాటాకు చప్పుళ్లకు తాము భయపడం’ అని స్పష్టం చేశారు.