News March 19, 2025

బడ్జెట్‌లో పేజీలే పెరిగాయి.. సంక్షేమం కాదు: హరీశ్ రావు

image

TG: మహిళలను ప్రభుత్వం మోసం చేస్తోందని మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. ‘బడ్జెట్‌లో అబద్ధాలు, అతిశయోక్తులే ఉన్నాయి. మహిళలకు రూ.5లక్షలు మాత్రమే వడ్డీలేని రుణం ఇస్తున్నారు. బడ్జెట్‌లో మాత్రం రూ.లక్ష కోట్ల వడ్డీలేని రుణాలు ఇస్తున్నామన్నారు. బడ్జెట్ పేజీలు పెరిగాయి తప్ప పేదలకు సంక్షేమం పెరగలేదు. మహిళలకు రూ.2,500 హామీ ఊసే లేదు. కానీ అందాల పోటీలకు రూ.250 కోట్లు బడ్జెట్‌లో పెట్టారు’ అని విమర్శించారు.

Similar News

News March 20, 2025

కుంభమేళాలో 1,000 మంది భక్తుల మిస్సింగ్: అఖిలేశ్ యాదవ్

image

ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన మహా కుంభమేళాలో మిస్సయిన 1,000మంది భక్తుల జాడ కనుక్కోవడంలో ఉత్తరప్రదేశ్ సర్కార్ విఫలమైందని ఎంపీ అఖిలేశ్ యాదవ్ ఆరోపించారు. ఇప్పటికీ ఆ ప్రాంతంలో తప్పిపోయిన వారి పోస్టర్లు ఉన్నాయన్నారు. యూపీ, MP ప్రభుత్వాలు కలిసి వెహికిల్ పార్కింగ్ ఏర్పాట్లు మాత్రమే చేశాయని దుయ్యబట్టారు. కుంభమేళా ఏర్పాట్లకు కేంద్రం ఎన్ని నిధులు కేటాయించిందో తెలపాలని అఖిలేశ్ యాదవ్ డిమాండ్ చేశారు.

News March 20, 2025

ఈసారి ఇంపాక్ట్ రూల్ ఉండాలా? వద్దా?

image

IPL-2025 ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇంపాక్ట్ రూల్‌‌పై మరోసారి చర్చ జరుగుతోంది. ఈ రూల్ క్రికెట్ స్ఫూర్తిని దెబ్బ తీస్తోందని, ఆల్‌రౌండర్లకు అన్యాయం జరుగుతోందని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ రూల్ ప్రవేశపెట్టాక 2023లో ఒకసారి, 2024లో 8 సార్లు 250కిపైగా స్కోర్లు నమోదయ్యాయి. అంతకుముందు ఒకసారి మాత్రమే (2013లో) 250+ నమోదైంది. 2024లో జట్ల రన్‌రేట్ 9.56గా ఉండగా 2022లో 8.54గానే ఉంది. దీనిపై మీ కామెంట్.

News March 20, 2025

ఓవర్ థింకింగ్ వేధిస్తోందా..? ఈ టిప్స్ పాటించండి

image

ఓవర్‌థింకింగ్‌కు ప్రధాన కారణం నెగిటివిటీ కనుక దానికి దూరంగా ఉండండి. మన నియంత్రణలో లేని విషయాల గురించి ఆలోచించడం మానేయండి. మిమ్మల్ని ఏ విషయమైన ఇబ్బంది పెడితే 72 గంటల పాటు దాన్ని మర్చిపోండి. తర్వాత అది మిమ్మల్ని అంతగా వేధించదు. సోషల్ మీడియా అధికంగా వాడటం వల్ల మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది కనుక దానికి దూరంగా ఉండండి. ధ్యానం చేయడంతో కంగారు తగ్గడంతో పాటు వాస్తవ పరిస్థితులని అర్థం చేసుకుంటారు.

error: Content is protected !!