News March 19, 2025

ఏప్రిల్ నుంచి ఎక్స్‌ట్రా చెల్లించాల్సిందే

image

దేశంలో APR నుంచి కార్ల ధరలు పెరగనున్నాయి. ఇటీవల మారుతీ సుజుకీ 4% పెంపు ప్రకటన చేయగా నిన్న టాటా మోటార్స్ కూడా 3% వరకు పెంచుతామంది. మిగతా ఆటో బ్రాండ్స్ కూడా కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి కొత్త రేట్లతో సేల్స్‌కు రెడీ అవుతున్నాయి. ఒకవేళ మీకు రాబోయే కొన్ని వారాల్లో కారు కొనే ఆలోచన ఉంటే ఈనెల 31లోపు తీసుకుంటే ఎక్స్‌ట్రా చెల్లింపు తప్పుతుంది. డెలివరీ తీసుకొనే రోజు ఉన్న ధరనే కంపెనీ పరిగణిస్తుందని మరువొద్దు.

Similar News

News March 20, 2025

ఉద్యోగుల రిటైర్మెంట్ ఏజ్ పెంచడం లేదు: కేంద్ర మంత్రి

image

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సులో ఎటువంటి మార్పులు చేయట్లేదని కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. కొన్ని రంగాల్లో రిటైర్మెంట్ వయస్సు 60 సంవత్సరాలుంటే మరికొన్నిచోట్ల 65గా ఉందని తెలిపారు. రాష్ట్ర ఉద్యోగుల పదవీ విరమణ అనేది స్టేట్స్‌కు సంబంధించిందని అన్నారు. అయితే తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు 58 సంవత్సరాలు ఉండగా గత ప్రభుత్వం 61 ఏళ్లకు పెంచింది.

News March 20, 2025

బీసీ రిజర్వేషన్ల అమలుకు ప్రధానిని కలుస్తాం: మంత్రి

image

TG: బీసీ రిజర్వేషన్ల అమలుకోసం అఖిలపక్షంతో వెళ్లి ప్రధానిని కలుస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మోదీ అపాయింట్ మెంట్ ఇప్పించాల్సిన బాధ్యత రాష్ట్ర బీజేపీ నేతలదేనని మంత్రి అన్నారు. BC రిజర్వేషన్లను బీజేపీ అడ్డుకోవాలని చూస్తే ప్రజలు ఊరుకోరని హెచ్చరించారు. హైదరాబాద్‌లో మిస్ వరల్డ్ పోటీలు పెడితే కేటీఆర్‌కు అభ్యంతరాలెందుకని మంత్రి ప్రశ్నించారు.

News March 20, 2025

కొబ్బరినీళ్లు తాగితే కలిగే ప్రయోజనాలివే..!

image

వేడివల్ల శరీరం కోల్పోయిన ఎలక్ట్రోలైట్స్‌ను తిరిగి బాడీకి అందిస్తాయి. దీంతో హైడ్రేట్‌గా ఉండవచ్చు. ఇందులో ఉండే పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం బాడీ ఎనర్జీ లెవెల్స్‌ను రెట్టింపు చేస్తాయి. జీర్ణ సమస్యల్ని తగ్గించటంతో పాటు కడుపు ఉబ్బరాన్నినియంత్రిస్తాయి. చర్మం అందంగా కాంతివంతంగా ఉండటంలో సహకరిస్తాయి. ఇందులో ఉండే పొటాషియం కిడ్నీల్ని ఆరోగ్యంగా ఉంచడంతో పాటు బీపీని కంట్రోల్ చేస్తుంది.

error: Content is protected !!