News March 19, 2025

ములుగు: మంత్రి సీతక్కకు కొత్త చిక్కులు!

image

మంత్రి సీతక్కకు కొత్త చిక్కులు వెంటాడుతున్నాయి. ఒకవైపు ఎమ్మెల్యే సీతక్క పేరుతో వాహనాలకు స్టిక్కర్లు వేసుకొని తిరుగుతున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా తాజాగా ములుగు జిల్లాలో కొందరు వ్యక్తులు మంత్రి సీతక్క వ్యక్తిగత పీఏ, పీఆర్‌వోలమంటూ మండల స్థాయి అధికారుల వద్దకు వెళ్లి చెబుతున్నారని సమాచారం. అలాంటి వారు ఎవరూ లేరని, క్రమశిక్షణ తప్పితే చర్యలు తీసుకుంటామని జిల్లా అధ్యక్షుడు అశోక్ హెచ్చరించారు.

Similar News

News July 4, 2025

న‌గ‌ర వైభ‌వాన్ని చాటిచెప్పేలా విజ‌య‌వాడ ఉత్స‌వ్‌: ఎంపీ చిన్ని

image

ఇంద్రకీలాద్రిపై ఏటా శరన్నవరాత్రులు ఎంతో వైభవంగా జ‌రుగుతాయ‌ని ఎంపీ కేశినేని చిన్ని అన్నారు. శుక్ర‌వారం క‌లెక్ట‌ర్ కార్యాల‌యంలో విజ‌య‌వాడ ఉత్స‌వ్‌పై జ‌రిగిన ప్రాథ‌మిక స‌మావేశంలో కలెక్టర్ లక్ష్మీశా, సీపీ రాజ‌శేఖ‌ర్ బాబు, తదితరులు పాల్గొని సాధ్యాసాధ్యాల‌పై చ‌ర్చించారు. విజ‌య‌వాడ న‌గ‌ర ప‌ర్య‌ట‌న మ‌ధురాను భూతులు మిగిల్చేలా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించాల‌ని చూస్తున్న‌ట్లు తెలిపారు.

News July 4, 2025

20 బైకులను ప్రారంభించిన SP

image

జిల్లాలో రాత్రిళ్లు నిఘాను మరింత పెంచేందుకు చర్యలు చేపట్టినట్లు SP కృష్ణ కాంత్ తెలిపారు. ఇందులో భాంగంగా 20 బైకులను ఆయన శుక్రవారం ప్రారంభించారు. పగలు, రాత్రిళ్లు గస్తీకి వీటిని వాడనున్నట్లు స్పష్టం చేశారు. నెల్లూరు ట్రాఫిక్, నెల్లూరు టౌన్, రూరల్, ఆత్మకూరు, కావలి, కందుకూరు సబ్ డివిజన్‌లకు వాటిని కేటాయించినట్లు తెలిపారు.

News July 4, 2025

ప్రసిద్ధ్ కృష్ణ చెత్త రికార్డు

image

ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమ్ ఇండియా పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ చెత్త రికార్డు నమోదు చేశారు. 2006 తర్వాత ఓ టెస్టులో తొలి 5 ఓవర్లలో 10 ERతో 50 రన్స్ ఇచ్చిన భారత బౌలర్‌గా ఆయన నిలిచారు. జేమీ స్మిత్, హ్యారీ బ్రూక్ బజ్ బాల్ ధాటికి ప్రసిద్ధ్ బలైపోయారు. పదే పదే షార్ట్ బంతులు విసిరి తగిన మూల్యం చెల్లించుకున్నారు. ప్రసిద్ధ్ సహా మిగతా బౌలర్లూ పెద్దగా ప్రభావం చూపట్లేదు.