News March 19, 2025

ఒంగోలు: ఫుడ్, బెడ్‌తోపాటు ఉచిత శిక్షణ

image

ఒంగోలు గ్రామీణాభివృద్ధి, స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత టైలరింగ్ శిక్షణ ఇస్తున్నట్లు ఆ శాఖ అధికారులు తెలిపారు. ఏప్రిల్ 11 నుంచి మే 10 వరకు నెల రోజులపాటు టైలరింగ్‌లో శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. నెల రోజులపాటు ఉండే శిక్షణలో భోజనం, వసతి పూర్తిగా ఉచితమన్నారు. ఆసక్తి కలిగిన వారు మరిన్ని వివరాలకు ఒంగోలు గ్రామీణాభివృద్ధి కార్యాలయానికి రావాలన్నారు.

Similar News

News March 20, 2025

కందికి మద్దతు కల్పిస్తాం: ప్రకాశం కలెక్టర్

image

ప్రకాశం జిల్లాలో రైతులు పండించిన కంది పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తామని కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. మర్రిపూడి మండలం చిమటలో ఏర్పాటు చేసిన కందుల సేకరణ కేంద్రాన్ని బుధవారం పరిశీలించారు. ఏపీ మార్క్‌ఫెడ్ ద్వారా కందులను కొనుగోలు చేస్తామన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 126 మెట్రిక్ టన్నుల కందులను మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేశామన్నారు. చిమటలో 35 టన్నుల కందిని రైతులు దగ్గర నుంచి కొనుగోలు చేశామన్నారు.

News March 20, 2025

ఒంగోలు: ఆర్టీసీ బస్సులో మహిళ మృతి.!

image

RTC బస్సులో మహిళ మృతి చెందిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఒంగోలులో నివాసం ఉంటున్న సాహినా బేగం హైదరాబాదు నుంచి కుటుంబ సభ్యులతో ఒంగోలు వస్తోంది. సంతమాగులూరు వద్దకు వచ్చేసరికి ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్ళింది. కుటుంబ సభ్యులు, ప్రయాణికులు గమనించి అంబులెన్స్‌కు సమాచారం అందించారు. అప్పటికే ఆమె మృతి చెందిందని నిర్ధారించారు.

News March 19, 2025

కందుకూరు యువకుడికి గేట్‌లో మొదటి ర్యాంక్

image

గేట్ ఫలితాలు నేడు వెలువడిన విషయం తెలిసిందే. అందులో ఉమ్మడి ప్రకాశం జిల్లా కందుకూరుకి చెందిన సాదినేని నిఖిల్ డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగంలో మొదటి ర్యాంక్ సాధించాడు. అతని తండ్రి శ్రీనివాసులు కందుకూరు ప్రకాశం ఇంజినీరింగ్ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. నిఖిల్ చెన్నై IITలో ఆన్‌లైన్ ద్వారా డేటా సైన్స్‌లో డిగ్రీ చేశాడు. అంతేకాకుండా ఇతను ఢిల్లీ ఎయిమ్స్‌లో MBBS పూర్తి చేశాడు.

error: Content is protected !!