News March 19, 2025

తానా మహాసభలకు మంత్రి సవితకు ఆహ్వానం

image

అమెరికాలోని మిచిగన్‌లో తానా ఆధ్వర్యంలో జరిగే తెలుగు మహా సభలకు మంత్రి ఎస్. సవితను ఆహ్వానించారు. తానా సంస్థ ప్రతినిధులు బుధవారం అమరావతిలోని అసెంబ్లీలో మంత్రి సవితను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ ఏడాది జులై 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు మూడ్రోజులపాటు, తానా తెలుగు మహాసభలు జరగనున్నాయి. ఇందుకు మంత్రి సవిత సానుకూలంగా స్పందించారు. తానా మహాసభలకు హాజరుకానున్నట్లు తెలిపారు.

Similar News

News March 20, 2025

భైoసా: ఆల్ ఇండియా పోటీలకు తపాలా ఉద్యోగులు

image

ఓ వైపు విధులు నిర్వర్తిస్తూనే క్రీడల్లో సత్తాచాటి జాతీయస్థాయికి ఎంపికయ్యారు జిల్లాకు చెందిన తపాలా ఉద్యోగులు వినోద్ కుమార్, నరేశ్‌కుమార్. HYDలో జరిగిన జాతీయస్థాయి ఖోఖో పోటీల్లో ప్రతిభ కనబర్చి అల్ ఇండియా సివిల్ సర్వీసెస్ పోటీలకు ఎంపికయ్యారు. ఈ నెల 21 నుంచి 24 వరకు ఢిల్లీలో జరిగే పోటీల్లో వీరు RSB HYD జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నారు. అక్కడ కూడా ప్రతిభ చాటాలంటే ఆల్ ది బెస్ట్ చెప్పేయండి మరి. 

News March 20, 2025

కుంభమేళాలో 1,000 మంది భక్తుల మిస్సింగ్: అఖిలేశ్ యాదవ్

image

ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన మహా కుంభమేళాలో మిస్సయిన 1,000మంది భక్తుల జాడ కనుక్కోవడంలో ఉత్తరప్రదేశ్ సర్కార్ విఫలమైందని ఎంపీ అఖిలేశ్ యాదవ్ ఆరోపించారు. ఇప్పటికీ ఆ ప్రాంతంలో తప్పిపోయిన వారి పోస్టర్లు ఉన్నాయన్నారు. యూపీ, MP ప్రభుత్వాలు కలిసి వెహికిల్ పార్కింగ్ ఏర్పాట్లు మాత్రమే చేశాయని దుయ్యబట్టారు. కుంభమేళా ఏర్పాట్లకు కేంద్రం ఎన్ని నిధులు కేటాయించిందో తెలపాలని అఖిలేశ్ యాదవ్ డిమాండ్ చేశారు.

News March 20, 2025

మెదక్: 24న సీజ్ చేసిన బియ్యం వేలం

image

పౌర సరఫరాల శాఖ మెదక్ జిల్లా ఆధ్వర్యంలో సీజ్ చేసిన బియ్యాన్ని వేలం నిర్వహిస్తున్నట్లు మెదక్ జిల్లా పౌర సరఫరాల అధికారి పేర్కొన్నారు. 6a కేసు కింద సీజ్ చేసి నిల్వ ఉంచిన బియ్యాన్ని వేలం ఈనెల 24న ఉదయం 10 గంటలకు వేలం నిర్వహించనున్నారు. వేలంలో పాల్గొనేవారు 22 సాయంత్రం 5 గంటలలో లోపు రూ.2500 డిపాజిట్ చేయాలని సూచించారు. అత్యధిక వేలం దారులకు బియ్యాన్ని అమ్మనున్నట్లు చెప్పారు.

error: Content is protected !!