News March 19, 2025

ADB: 20న కందులు, శనగల కొనుగోళ్లు బంద్

image

కందులు, శనగలు కొనుగోళ్లను ఈనెల 20న నిలిపివేస్తున్నట్లు ఆదిలాబాద్ సెంటర్ ఇన్‌ఛార్జ్ కేంద్రే పండరి బుధవారం తెలిపారు. కందులు, శనగల నిల్వలు అధికంగా ఉన్నందున కొనుగోళ్లు  జరగవన్నారు. ఈనెల 21 నుంచి కొనుగోళ్లు యథావిధిగా జరుగుతాయని పేర్కొన్నారు. రైతులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని అధికారులు కోరారు.

Similar News

News January 6, 2026

అటవీ ప్రాంతాల్లో రోడ్డు పనుల అనుమతులపై ప్రత్యేక దృష్టి: కలెక్టర్

image

ఆదిలాబాద్ జిల్లాలో అటవీ ప్రాంతాల మీదుగా ప్రతిపాదించిన రహదారి నిర్మాణ పనులకు సంబంధించి అటవీ శాఖ అనుమతులు, పెండింగ్‌లో ఉన్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ రాజర్షిషా అధికారులను ఆదేశించారు. మంగళవారం డీఎఫ్ఓ ప్రశాంత్ బాజీరావు పాటిల్‌తో కలిసి సంబంధిత శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అటవీ సంరక్షణ చట్టాల నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ అభివృద్ధి పనులు కొనసాగించాలని సూచించారు.

News January 6, 2026

ప్రైవేట్ ట్రావెల్స్ డ్రైవర్లు నియమాలు పాటించాలి: డీఎస్పీ

image

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో గూడ్స్ సరుకులు రవాణా చేయవద్దని, ప్రతి బస్సులో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్ రెడ్డి తెలిపారు. డ్రైవర్లు మద్యం తాగి వాహనాలు నడపకుండా ఓనర్లు బాధ్యత వహించాలని, రోడ్డు భద్రత నియమాలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. అనుమానాస్పద ప్రయాణికులు, నిషేధిత పదార్థాలపై అప్రమత్తంగా ఉండి వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు.

News January 6, 2026

నాగోబా జాతరకు పటిష్ఠ బందోబస్తు: ఎస్పీ అఖిల్ మహాజన్

image

కేస్లాపూర్‌లో ఈనెల 18 నుంచి ప్రారంభం కానున్న నాగోబా జాతర ఏర్పాట్లను ఎస్పీ అఖిల్ మహాజన్ మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జాతరకు భారీగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు భద్రతా చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. జాతరలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా వాహనాల పార్కింగ్, రూట్ మ్యాప్‌ను సిద్ధం చేశామన్నారు. అదనపు ఎస్పీ కాజల్ సింగ్, ఇతర సిబ్బంది ఆయనతోపాటు ఉన్నారు.