News March 19, 2025

KMR: ఇసుక సరఫరాకు సర్వే: కలెక్టర్

image

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుక సరఫరాకు జాయింట్ సర్వే నిర్వహించి నివేదికలు సమర్పించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సూచించారు. బుధవారం కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో రెవెన్యూ, మైనింగ్, భూగర్భ జల శాఖ, నీటిపారుదల శాఖల అధికారులతో జిల్లా స్థాయి సాండ్ (ఇసుక) కమిటీ సమావేశం నిర్వహించారు.

Similar News

News March 20, 2025

6 నెలల్లోపు పెట్రోల్ వాహనాల ధరకే EVలు: నితిన్ గడ్కరీ

image

వచ్చే 6 నెలల్లోపు EVల ధర పెట్రోల్ వాహనాలకు సమానం అవుతుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. దేశాన్ని మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు మౌలిక సదుపాయాల రంగాన్ని మెరుగుపరచాల్సిన అవసరం ఉందన్నారు. మంచి రహదారులను నిర్మించడం ద్వారా వస్తువుల రవాణా ఖర్చును తగ్గించవచ్చని పేర్కొన్నారు. స్మార్ట్ సిటీల నిర్మాణంతో పాటు స్మార్ట్ ట్రాన్స్‌పోర్ట్ వ్యవస్థ ఏర్పాటుకు కేంద్రం కట్టుబడి ఉందని తెలిపారు.

News March 20, 2025

చెన్నారావుపేట: రెండు రోజుల్లో టెన్త్ పరీక్షలు.. విద్యార్థి మృతి

image

మరో రెండు రోజుల్లో వార్షిక పరీక్షలకు వెళ్లాల్సిన పదో తరగతి విద్యార్ధి గుండె సంబంధిత వ్యాధితో మృతి చెందిన విషాద ఘటన వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం జల్లిలో చోటుచేసుకుంది. పింగిలి అశ్వంత్ రెడ్డి నర్సంపేటలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. అస్వస్థతకు గురికాగా ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ అశ్వంత్ బుధవారం మృతి చెందాడు. కొడుకు మృతితో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.

News March 20, 2025

ధాన్యం కొనుగోళ్ల కేంద్రాలపై వనపర్తి కలెక్టర్ సూచన 

image

రైతుల నుంచి 2024-25 రబీ సీజన్‌కు సంబంధించి వరి ధాన్యం కొనుగోలు చేసేందుకు ప్రణాళికాబద్ధంగా కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. బుధవారం కలెక్టర్ తన ఛాంబర్‌లో అదనపు కలెక్టర్ జి.వెంకటేశ్వర్లుతో కలిసి రబీ సీజన్ వరి కొనుగోలుపై సమావేశం నిర్వహించారు. రైతుల నుంచి వరి ధాన్యం కొనుగోలు చేసేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

error: Content is protected !!