News March 19, 2025
క్రెడిట్ కార్డులను క్లోజ్ చేస్తున్నారా?

కొందరు ఖర్చులు పెరిగిపోతున్నాయంటూ క్రెడిట్ కార్డులను క్లోజ్ చేయాలని భావిస్తుంటారు. కానీ వాటిని తీసేస్తే క్రెడిట్ హిస్టరీ దెబ్బతింటుంది. క్రెడిట్ స్కోర్ పడిపోయే ఛాన్స్ ఉంది. ఇవి అత్యవసర పరిస్థితుల్లో బ్యాకప్‌గా ఆదుకుంటాయి. ఈ కార్డులను యాక్టివ్‌గా ఉంచుకోవడమే బెటర్. అతిగా ఖర్చు చేసేవారు మాత్రం క్లోజ్ చేసుకుంటేనే మంచిది. మీరు ఉపయోగించకపోయినా మేనేజ్‌మెంట్ ఛార్జీలు ఎక్కువైతే కార్డు తీసేయడం ఉత్తమం.
Similar News
News March 20, 2025
ఉద్యోగుల రిటైర్మెంట్ ఏజ్ పెంచడం లేదు: కేంద్ర మంత్రి

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సులో ఎటువంటి మార్పులు చేయట్లేదని కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. కొన్ని రంగాల్లో రిటైర్మెంట్ వయస్సు 60 సంవత్సరాలుంటే మరికొన్నిచోట్ల 65గా ఉందని తెలిపారు. రాష్ట్ర ఉద్యోగుల పదవీ విరమణ అనేది స్టేట్స్‌కు సంబంధించిందని అన్నారు. అయితే తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు 58 సంవత్సరాలు ఉండగా గత ప్రభుత్వం 61 ఏళ్లకు పెంచింది.
News March 20, 2025
బీసీ రిజర్వేషన్ల అమలుకు ప్రధానిని కలుస్తాం: మంత్రి

TG: బీసీ రిజర్వేషన్ల అమలుకోసం అఖిలపక్షంతో వెళ్లి ప్రధానిని కలుస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మోదీ అపాయింట్ మెంట్ ఇప్పించాల్సిన బాధ్యత రాష్ట్ర బీజేపీ నేతలదేనని మంత్రి అన్నారు. BC రిజర్వేషన్లను బీజేపీ అడ్డుకోవాలని చూస్తే ప్రజలు ఊరుకోరని హెచ్చరించారు. హైదరాబాద్‌లో మిస్ వరల్డ్ పోటీలు పెడితే కేటీఆర్‌కు అభ్యంతరాలెందుకని మంత్రి ప్రశ్నించారు.
News March 20, 2025
కొబ్బరినీళ్లు తాగితే కలిగే ప్రయోజనాలివే..!

వేడివల్ల శరీరం కోల్పోయిన ఎలక్ట్రోలైట్స్‌ను తిరిగి బాడీకి అందిస్తాయి. దీంతో హైడ్రేట్‌గా ఉండవచ్చు. ఇందులో ఉండే పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం బాడీ ఎనర్జీ లెవెల్స్‌ను రెట్టింపు చేస్తాయి. జీర్ణ సమస్యల్ని తగ్గించటంతో పాటు కడుపు ఉబ్బరాన్నినియంత్రిస్తాయి. చర్మం అందంగా కాంతివంతంగా ఉండటంలో సహకరిస్తాయి. ఇందులో ఉండే పొటాషియం కిడ్నీల్ని ఆరోగ్యంగా ఉంచడంతో పాటు బీపీని కంట్రోల్ చేస్తుంది.