News March 19, 2025
సత్యసాయి: 10th పరీక్షలకు 141 మంది గైర్హాజరు.!

శ్రీ సత్యసాయి జిల్లాలో బుధవారం జరిగిన పదవ తరగతి పరీక్షలలో 141 మంది విద్యార్థులు గైర్హాజరైనట్టు జిల్లా విద్యాశాఖ అధికారి కృష్ణయ్య తెలిపారు. జిల్లాలోని 104 కేంద్రాలలో రెగ్యులర్ విద్యార్థులు 21,240 మందికి గాను 21,109 మంది విద్యార్థులు హాజరయ్యారని, 31 మంది ప్రైవేట్ విద్యార్థులకు గాను పదిమంది గైర్హాజరయ్యారన్నారు.
Similar News
News March 28, 2025
సంగారెడ్డి: రూ.25 కోట్ల సీఎస్ఆర్ నిధులతో అభివృద్ధి: కలెక్టర్

జిల్లాలో 2024-25 సంవత్సరానికి రూ.25 కోట్ల సీఎస్ఆర్ నిధులతో చేపట్టిన పనులు చేపట్టినట్లు కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశించారు. కలెక్టరేట్లో అధికారులతో సమావేశం నిర్వహించారు. సీఎస్ఆర్ నిధులతో అంగన్వాడి కేంద్రాలు, ప్రభుత్వ ఆసుపత్రులు, పాఠశాలలో మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు చెప్పారు. వచ్చే చేయడానికి ప్రణాళికలు తయారు చేయాలని సూచించారు. సమావేశంలో అధికారులు పాల్గొన్నారు.
News March 28, 2025
సంగారెడ్డి: ‘సెర్ఫ్ లక్ష్యసాధనకు కృషి చేయండి’

సెర్ఫ్ లక్ష్య సాధనకు కృషి చేయాలని పంచాయతీ రాజ్ రాష్ట్ర కార్యదర్శి లోకేశ్ కుమార్ అన్నారు. హైదరాబాద్ నుంచి సంగారెడ్డి జిల్లా కలెక్టర్, అధికారులతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఐకెపీ కేంద్రాలకు చెల్లించాల్సిన పెండింగ్ కమిషన్ వెంటనే చెల్లించాలని చెప్పారు. స్టిచ్చింగ్ కేంద్రాల ద్వారా ప్రైవేట్ ఆర్డర్లు సైతం చేపట్టాలని సూచించారు.
News March 28, 2025
నగర అభివృద్ధిపై దృష్టి సారించాలి: KNR మున్సిపల్ ప్రత్యేక అధికారి

కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ తో పాటు వివిధ అంశాలపై జిల్లా కలెక్టర్, మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక అధికారి పమేలా సత్పతి సమావేశం నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయంలో అన్ని విభాగాల అధికారులతో గురువారం ఈ సమావేశం నిర్వహించారు. బడ్జెట్ ఆదాయ వ్యయాల అంచనా నివేదికలను కలెక్టర్ పరిశీలించారు. అధికారులు కరీంనగర్ నగర అభివృద్ధిపై దృష్టి సారించాలని సూచించారు.