News March 19, 2025
శోభితలో నాకు నచ్చే విషయం ఇదే: చైతూ

తన భార్య శోభితలో తనకు నచ్చే విషయమేంటో నాగచైతన్య ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ‘ఆమె తెలుగు భాషా నైపుణ్యాలు నన్ను ఆశ్చర్యపరుస్తాయి. మామ, మా కుటుంబసభ్యులు కూడా తెలుగులోనే మాట్లాడతారు. కానీ నేను చెన్నైలో చదువుకోవడంతో తమిళం నేర్చుకున్నా. ఇంట్లో ఇంగ్లిష్‌లో మాట్లాడతా. కాబట్టి నా తెలుగు ఆమెలా స్పష్టంగా ఉండదు. ఆమెనే నాకు నేర్పించాలి. తన తెలివితేటలనూ పంచాలని శోభితతో జోక్ చేస్తుంటా’ అని చైతూ చెప్పారు.
Similar News
News March 20, 2025
ఉద్యోగుల రిటైర్మెంట్ ఏజ్ పెంచడం లేదు: కేంద్ర మంత్రి

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సులో ఎటువంటి మార్పులు చేయట్లేదని కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. కొన్ని రంగాల్లో రిటైర్మెంట్ వయస్సు 60 సంవత్సరాలుంటే మరికొన్నిచోట్ల 65గా ఉందని తెలిపారు. రాష్ట్ర ఉద్యోగుల పదవీ విరమణ అనేది స్టేట్స్‌కు సంబంధించిందని అన్నారు. అయితే తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు 58 సంవత్సరాలు ఉండగా గత ప్రభుత్వం 61 ఏళ్లకు పెంచింది.
News March 20, 2025
బీసీ రిజర్వేషన్ల అమలుకు ప్రధానిని కలుస్తాం: మంత్రి

TG: బీసీ రిజర్వేషన్ల అమలుకోసం అఖిలపక్షంతో వెళ్లి ప్రధానిని కలుస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మోదీ అపాయింట్ మెంట్ ఇప్పించాల్సిన బాధ్యత రాష్ట్ర బీజేపీ నేతలదేనని మంత్రి అన్నారు. BC రిజర్వేషన్లను బీజేపీ అడ్డుకోవాలని చూస్తే ప్రజలు ఊరుకోరని హెచ్చరించారు. హైదరాబాద్‌లో మిస్ వరల్డ్ పోటీలు పెడితే కేటీఆర్‌కు అభ్యంతరాలెందుకని మంత్రి ప్రశ్నించారు.
News March 20, 2025
కొబ్బరినీళ్లు తాగితే కలిగే ప్రయోజనాలివే..!

వేడివల్ల శరీరం కోల్పోయిన ఎలక్ట్రోలైట్స్‌ను తిరిగి బాడీకి అందిస్తాయి. దీంతో హైడ్రేట్‌గా ఉండవచ్చు. ఇందులో ఉండే పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం బాడీ ఎనర్జీ లెవెల్స్‌ను రెట్టింపు చేస్తాయి. జీర్ణ సమస్యల్ని తగ్గించటంతో పాటు కడుపు ఉబ్బరాన్నినియంత్రిస్తాయి. చర్మం అందంగా కాంతివంతంగా ఉండటంలో సహకరిస్తాయి. ఇందులో ఉండే పొటాషియం కిడ్నీల్ని ఆరోగ్యంగా ఉంచడంతో పాటు బీపీని కంట్రోల్ చేస్తుంది.