News March 19, 2025

వేగంగా కమర్షియల్ ట్రేడ్ పన్ను వసూలు చేయాలి: అశ్విని తానాజీ 

image

వేగవంతంగా కమర్షియల్ ట్రేడ్ వసూలు చేయాలని బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకాడే అధికారులను ఆదేశించారు. కమర్షియల్ ట్రేడ్ పన్ను వసూళ్లపై ప్రజా ఆరోగ్య విభాగ అధికారులు, డిప్యూటీ కమిషనర్ తో ఏర్పాటు చేసిన సమావేశంలో కమిషనర్ తగు సూచనలు చేశారు. వేగంగా కమర్షియల్ ట్రేడ్ వసూళ్ల చేయడానికి సానిటరీ ఇన్‌స్పెక్టర్లు, రెవిన్యూ అధికారులు, జవాన్లతో బృందాలను ఏర్పాటు చేసి, సర్కిల్‌కు 7 బృందాలు కేటాయించారు.

Similar News

News September 13, 2025

నరసరావుపేట: తొలి సమీక్ష సమావేశం నిర్వహించిన కలెక్టర్

image

పల్నాడు జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన కృతిక శుక్లా శనివారం కలెక్టరేట్లో జేసీ సూరజ్, జిల్లా అధికారులతో తొలి సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతా కార్యక్రమాల అమలు గురించి చర్చించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలు, కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో చర్చించాల్సిన పలు అంశాలపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

News September 13, 2025

కడప: RIMS పూర్వ వైద్యాధికారులపై విచారణకు ఆదేశాలు

image

కడప RIMSలో గతంలో పనిచేసిన వైద్యాధికారులపై విచారణకు ఆదేశిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డాక్టర్లు సురేశ్వర రెడ్డి, జొన్న నగేశ్, షేక్ మహబూబ్ బాషా, సంజీవయ్య, సత్యనారాయణపై విచారణకు అధికారులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. రాష్ట్ర వైద్య విద్య డైరెక్టర్ డాక్టర్ వెంకటేశ్వరావు, కడప ఏసీబీ ఇన్స్పెక్టర్ శ్రీనివాసుల రెడ్డిలను విచారణాధికారులుగా నియామకం చేశారు.

News September 13, 2025

కర్నూలు: ‘ప్రజల వద్దకే తపాల సేవలు’

image

తపాల శాఖలో నూతన టెక్నాలజీ పరిజ్ఞానంతో రూపొందించిన ఐయంఏ 2.O ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో సైతం ప్రజల ముంగిటే తపాల సేవలను అందివ్వడం జరుగుతుందని కర్నూలు జిల్లా పోస్టల్ ఎస్పీ జనార్ధన్ రెడ్డి తెలిపారు. శనివారం తుంగభద్ర ఉప తపాల కార్యాలయంను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా బీపీఎంలు, ఎబీపీఎంలతో సమావేశం నిర్వహించారు. తక్కువ ప్రీమియం, ఎక్కువ బోనస్‌తో తపాల బీమా, ఐపీపీబీ ద్వారా ఖాతాలు తెరవడం జరిగిందని తెలిపారు.