News March 19, 2025

వరంగల్: తగ్గిన అరుదైన రకం మిర్చి ధరలు

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో బుధవారం పలురకాల మిర్చి ఉత్పత్తుల ధరలు ఇలా ఉన్నాయి. దీపిక మిర్చి క్వింటాకి నిన్నటిలాగే రూ.15,800 ధర వచ్చింది. 5531 రకం మిర్చి నిన్న రూ.11,000 ధర పలకగా నేడు రూ. 10,500కి తగ్గింది. అలాగే టమాటా మిర్చికి నిన్నటిలాగే రూ.30 వేలు ధర, సింగిల్ పట్టి మిర్చికి మంగళవారం రూ.33వేలు ధర రాగా నేడు రూ. 31వేలకి పడిపోయిందని వ్యాపారులు తెలిపారు.

Similar News

News January 13, 2026

నెల్లూరు జిల్లాలో చైనా మాంజాలు నిషేధం: SP

image

నెల్లూరు జిల్లాలో చైనా మాంజా వాడకాన్ని నిషేధిస్తున్నామని ఎస్పీ డాక్టర్ అజిత వెజెండ్ల వెల్లడించారు. ‘సంక్రాంతి సమయంలో గాలిపటాలు ఎగరవేయడం ఆనవాయితీ. అందరూ సంతోషంగా పతంగులు ఎగరవేయాలి. చైనా మాంజా(దారం) వాడకంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆ దారాలు అమ్మడం చట్టరీత్యా నేరం. ఎక్కడైనా ఆ మాంజాను విక్రయిస్తే 100కు డయల్ చేయండి’ అని ఎస్పీ కోరారు.

News January 13, 2026

ప్రతి ఒక్కరూ నియమాలు పాటించాలి: ఎస్పీ

image

రోడ్డుపై వెళ్లే ప్రతి ఒక్కరూ భద్రత నియమాలు పాటించాలని ASF జిల్లా ఎస్పీ నితిక పంత్ అన్నారు. డీజీపీ ఆదేశాల మేరకు’అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రతా కార్యక్రమం జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్ ఫరిదీలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
వాహనదారులు విధిగా భద్రతా నియమాలు పాటించాలని కోరారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కారు నడిపే వారు సీట్ బెల్ట్ ధరించడం వల్ల ప్రమాదాల నుంచి ప్రాణాపాయం తప్పుతుందని వివరించారు.

News January 13, 2026

చలాన్ పడగానే డబ్బు కట్ కావాలా?

image

చలాన్ పడితే ఆటోమేటిక్‌గా డబ్బు కట్ అయ్యేలా బ్యాంక్ అకౌంట్ <<18838769>>లింక్<<>> చేయాలన్న సీఎం రేవంత్ వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విధానం వల్ల ట్రాఫిక్ నిబంధనల అమలు కఠినంగా మారుతుందని కొందరు భావిస్తుండగా చలాన్ల ఇష్యూలు మరింత పెరుగుతాయని వాహనదారులు భయపడుతున్నారు. సాంకేతిక లోపాల వల్ల తప్పుడు ఫైన్లు పడితే కట్ అయిన డబ్బును తిరిగి పొందడమూ కష్టమేనంటున్నారు. ఇంతకీ ఈ నిర్ణయంపై మీ అభిప్రాయం ఏంటి?