News March 19, 2025

నారాయణపేట జిల్లా బిడ్డ సత్తా..!

image

నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలానికి చెందిన కనకప్ప పారా అథ్లెటిక్ ఖేలో ఇండియా జాతీయ స్థాయి లాంగ్ జంప్ క్రీడలకు ఎంపికైనట్లు అథ్లెటిక్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి రమణ బుధవారం తెలిపారు. ఈనెల 21 నుంచి 23 వరకు ఢిల్లీలో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారని చెప్పారు. జాతీయ స్థాయి క్రీడలకు విద్యార్థి ఎంపిక కావడంపై క్రీడాకారులు, క్రీడాభిమానులు, అసోసియేషన్ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.

Similar News

News January 13, 2026

కడియం నర్సరీలలో మొక్కలతో సంక్రాంతి శోభ

image

కడియం పల్ల వెంకన్న నర్సరీలో మంగళవారం సంక్రాంతి సందడి నెలకొంది. పండుగను పురస్కరించుకుని మొక్కలతో రూపొందించిన ప్రత్యేక ఆకృతులు సందర్శకులను కట్టిపడేస్తున్నాయి. భోగి మంట, పాలకుండ, గాలిపటం, ఎద్దు, కోడిపుంజు వంటి పండుగ ప్రతీకలను సృజనాత్మకంగా తీర్చిదిద్దారు. సంక్రాంతి శోభను ప్రతిబింబిస్తున్న ఈ మొక్కల కళాఖండాలను చూసేందుకు పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు.

News January 13, 2026

సంగారెడ్డి: ‘నవజాత శిశు మరణాలు తగ్గించాలి’

image

జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో నవజాత శిశు మరణాలు తగ్గించేలా చూడాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ వసంత రావు అన్నారు. సంగారెడ్డిలోని కార్యాలయంలో వైద్యులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతి 1,000 మంది శిశువుల్లో 18 మంది మరణిస్తున్నారని, ఆ సంఖ్య పదికి తగ్గించాలని సూచించారు. సమావేశంలో ఆసుపత్రి వైద్యులు పాల్గొన్నారు.

News January 13, 2026

తిరుపతి: పండగ పూట పస్తులేనా..?

image

తిరుపతి జిల్లాలో 23 అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లు ఉన్నాయి. ఇందులో పని చేస్తున్న 150 మంది సిబ్బందికి 12వ తేదీ అయినా జీతాలు అందలేదు. జీతాలు లేకుండా పండగ పూట కూడా పస్తులు ఉండాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు సకాలంలో జీతాలు చెల్లించాలని ఆ సంఘ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.