News March 19, 2025

విశాఖ, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుల్లో కదలిక

image

AP: విశాఖ, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుల సీఎంపీ(Comprehensive Mobility Plan) కోసం కేంద్ర ప్రభుత్వం AP మెట్రో రైల్ కార్పొరేషన్‌కు నిధులు మంజూరు చేసింది. ఈ మెట్రో ప్రాజెక్టుల మొబిలిటీ ప్లాన్ గడువు ముగిసింది. దీంతో మరోసారి ప్లాన్ రూపొందించాలని సెంట్రల్ అర్బన్ ట్రాన్స్‌పోర్ట్ విభాగం కోరింది. కేంద్రం సూచనలతో విశాఖలో రూ.84.47లక్షలు, విజయవాడలో రూ.81.68లక్షలతో సిస్ట్ర MVA సంస్థ ప్లాన్ రూపొందించనుంది.

Similar News

News March 20, 2025

ఆర్ఆర్‌బీ లోకో పైలట్ పరీక్ష వాయిదా

image

RRB అసిస్టెంట్ లోకో పైలట్ సీబీటీ-2 పరీక్షను రైల్వే శాఖ వాయిదా వేసింది. నిన్న షిఫ్ట్ 1, 2లో జరగాల్సిన పరీక్షల్లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. ఏ సెంటర్లనోనైతే ఎగ్జామ్ జరగలేదో వారికి త్వరలోనే పరీక్ష నిర్వహిస్తామని పేర్కొంది. అప్డేట్స్ కోసం తరచూ వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించింది. కాగా 18,799 పోస్టులకు గతేడాది సీబీటీ-1 నిర్వహించి, ఫలితాలు వెల్లడించారు.

News March 20, 2025

ఆ ఉద్యోగులకు భారీగా పెరగనున్న జీతాలు

image

దేశంలోని గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల(GCC)లో పని చేసే ఉద్యోగుల వేతనాలు వచ్చే ఏడాదిలో 9.8% మేర పెరగనున్నట్లు ఓ నివేదిక అంచనా వేసింది. ఉద్యోగుల వేతనాల వృద్ధిలో GCCలు IT కంపెనీలను మించిపోయాయంది. 2030 నాటికి వీటి మార్కెట్ విలువ 11,000కోట్ల డాలర్లకు చేరవచ్చని పేర్కొంది. దీంతో నైపుణ్యాలున్న ఉద్యోగులకు వేతనాలు గణనీయంగా పెరుగుతాయంది. ప్రస్తుతం హైదరాబాద్, ముంబై GCCలు అధిక జీతాలు చెల్లిస్తున్నాయి.

News March 20, 2025

జనాభా కంటే ఫోన్లే ఎక్కువ

image

తెలంగాణ జనాభా కంటే ఫోన్ల సంఖ్యే ఎక్కువగా ఉందని బడ్జెట్ ద్వారా వెల్లడైంది. రాష్ట్రంలో 4.42 కోట్ల మొబైల్స్, 15.2 లక్షల ల్యాండ్ లైన్ ఫోన్లు ఉన్నాయి. ఇక రాష్ట్రంలో మొత్తం 1.71 కోట్ల వాహనాలు ఉన్నాయి. ఇందులో టూ వీలర్‌ల వాటా 73.52%. మిగతా కేటగిరీలో కార్లు, ఆటోలు, బస్సులు, మధ్య స్థాయి, భారీ రవాణా వాహనాలున్నాయి.

error: Content is protected !!