News March 19, 2025

వరంగల్: అందంగా రూపుదిద్దుకున్న అస్తమయం..!

image

వేసవికాలంలో సూర్యుడు అగ్నిగోళాన్ని తలపిస్తుంటాడు. ప్రస్తుతం మార్చి నెలలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఉదయం నుంచి అలా వేడెక్కి సూర్యుడు సాయంత్రానికి కాస్త శాంతిస్తాడు. అలాగే సాయంత్రం వేళ అందంగా కూడా కనిపిస్తాడు. వరంగల్ లోని హంటర్ రోడ్ లో బుధవారం ఇలా సూర్యాస్తమయం ప్రజలను ఆకట్టుకుంది. SHARE

Similar News

News March 20, 2025

పదవ తరగతి పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS: వరంగల్ సీపీ

image

ఈనెల 21 నుంచి పదవ తరగతి పరీక్షలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పరీక్ష కేంద్రాల వద్ద ఏప్రిల్ 4 వరకు సెక్షన్ 163 BNSS యాక్ట్-2023(144 సెక్షన్) అమలులో ఉంటుందని వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. పరీక్ష కేంద్రాలకు ఐదు వందల మీటర్ల దూరం వరకు ఇద్దరికి మించి గుంపులుగా ఉండొద్దని సీపీ సూచించారు.

News March 20, 2025

చెన్నారావుపేట: రెండు రోజుల్లో టెన్త్ పరీక్షలు.. విద్యార్థి మృతి

image

మరో రెండు రోజుల్లో వార్షిక పరీక్షలకు వెళ్లాల్సిన పదో తరగతి విద్యార్ధి గుండె సంబంధిత వ్యాధితో మృతి చెందిన విషాద ఘటన వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం జల్లిలో చోటుచేసుకుంది. పింగిలి అశ్వంత్ రెడ్డి నర్సంపేటలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. అస్వస్థతకు గురికాగా ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ అశ్వంత్ బుధవారం మృతి చెందాడు. కొడుకు మృతితో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.

News March 20, 2025

బడ్జెట్ సంబంధిత సమాచారంతో అధికారులు సిద్ధంగా ఉండాలి: మేయర్

image

బడ్జెట్ సంబంధిత సమాచారంతో అధికారులు సిద్ధంగా ఉండాలని మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. రేపు జరగబోయే 2024-25కు సంబంధించిన బడ్జెట్ సమావేశం నిర్వహణ దృష్ట్యా బుధవారం ప్రధాన కార్యాలయంలో కమిషనర్ అశ్విని తానాజీ వాకడేతో కలిసి బడ్జెట్ అంశాలపై మేయర్ సమీక్షించారు. అధికారులు ఆదాయ వ్యయాలపై అవగాహన కలిగి ఉండి, సభ్యులు అడిగే అంశాలకు సమాధానం ఇచ్చే విధంగా ఉండాలని అన్నారు.

error: Content is protected !!