News March 19, 2025
HYDలో అచ్చంపేట యువకుడి ఆత్మహత్య

నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం చేదురుబావి తండాకు చెందిన మూడవత్ బాలు నాయక్ హైదరాబాద్‌లో ఆత్మహత్యకు పాల్పడ్డాడని స్థానికులు తెలిపారు. బతుకుదెరువు కోసం కొన్నేళ్లుగా హైదరాబాద్‌లో ఉంటూ జీవనం సాగిస్తున్నాడన్నారు. ఆర్థిక ఇబ్బందులు, దానికి తోడు కుటుంబ కలహాలతో బాలు నాయక్ ఈరోజు ఆత్మహత్యకు పాల్పడ్డాడని చెప్పారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Similar News
News January 4, 2026
కూరగాయల పంట పెరిగింది: మాధవి

ఉద్యానశాఖ చేపట్టిన చర్యల వల్ల గతేడాది సీజన్ 767 ఎకరాలుగా ఉన్న కూరగాయల విస్తీర్ణం ఈ ఏడాదిలో 1,458 ఎకరాలకు పెరిగిందని జిల్లా ఉద్యానవన అధికారి మాధవి తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో కూరగాయల సాగు చేసే రైతులు 1,710 మంది వరకు ఉన్నారన్నారు. కూరగాయల సాగు కోసం మల్చింగ్ షీట్ వేసిన రైతులకు ఎకరానికి రూ.8వేలు ఆర్థిక సహాయం అందజేస్తున్నామన్నారు.
News January 4, 2026
విశాఖ: ప్రభుత్వ కార్యాలయాలలో రేపు పీజీఆర్ఎస్

జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) నిర్వహిస్తున్నట్లు జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. సోమవారం ఉదయం 11 గంటల నుంచి అర్జీలు స్వీకరిస్తామన్నారు. జీవీఎంసీ జోనల్ కార్యాలయాల్లో, కలెక్టరేట్లో, సీపీ కార్యాలయంలో ఉదయం వినతులు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News January 4, 2026
చంద్రబాబు స్వార్థ రాజకీయాలతో రాయలసీమకు అన్యాయం: అంబటి

AP: TG CM రేవంత్‌రెడ్డితో చంద్రబాబు కుదుర్చుకున్న రహస్య ఒప్పందాలు రాయలసీమకు మరణశాసనంగా మారాయని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. స్వార్థం కోసం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును అడ్డుకున్నారన్నారు. గతంలో ఆల్మట్టి, పోలవరం, ప్రత్యేక హోదా విషయంలోనూ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని పేర్కొన్నారు. అధికారం కోసం AP ప్రయోజనాలను పక్కనపెట్టి రాష్ట్రాన్ని చంద్రబాబు దెబ్బతీస్తున్నారని ధ్వజమెత్తారు.


