News March 19, 2025

మా పోరాటంతోనే ఎస్సీ వర్గీకరణ చట్టం: మందకృష్ణ

image

మూడు దశాబ్దాల పాటు ఎస్సీ వర్గీకరణపై తాము చేపట్టిన పోరాట ఫలితమే వర్గీకరణకు చట్ట రూపం దాల్చిందని పద్మశ్రీ మందకృష్ణ మాది అన్నారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన క్లబ్‌లో మాట్లాడుతూ.. వర్గీకరణ చట్ట రూపం దాల్చడంతో నెలరోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా సభలు, విజయోత్సవం నిర్వహిస్తామన్నారు. చట్టం మా చేతిలో పెట్టి ఉద్యోగాలన్నీ వారికి దోచి పెట్టారన్నారు.

Similar News

News November 2, 2025

HYD: ప్రచారంలో దోశ వేసిన మంత్రి

image

జూబ్లీహిల్స్ పరిధి రహమత్‌నగర్ డివిజన్‌లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈరోజు ఉపఎన్నిక ప్రచారాన్ని నిర్వహించారు. శ్రీరామ్ నగర్, సంధ్యా నగర్, కార్మిక నగర్, వినాయకనగర్, ఎస్‌పీఆర్ హిల్స్‌లో పాదయాత్ర నిర్వహించి, ఇంటింటికీ తిరుగుతూ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను గెలిపించాలని కోరారు. అనంతరం ఓ హోటల్‌లో మంత్రి దోశ వేసి సందడి చేశారు. కాంగ్రెస్‌ను గెలిపించి, ప్రజాపాలనకు మద్దతు తెలపాలన్నారు.

News November 2, 2025

HYD: తెలంగాణ జాగృతి టీచర్స్ ఫెడరేషన్ నూతన కమిటీ ఏర్పాటు

image

తెలంగాణ జాగృతి బలోపేతంపై కవిత ఫోకస్ పెట్టారు. తాజాగా టీచర్స్ ఫెడరేషన్ నూతన కమిటీని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. ఫెడరేషన్ నూతన కమిటీ అధ్యక్షుడిగా మోరం వీరభద్రరావు, ఉపాధ్యక్షుడిగా బుర్ర రమేశ్ గౌడ్, ప్రధాన కార్యదర్శిగా జాడి శ్రీనివాస్, కోశాధికారిగా ఘనపురం దేవేందర్‌ను నియమించినట్లు ఆమె తెలిపారు. వెంటనే వీరి నియామకాలు అమల్లోకి వస్తాయని కవిత పేర్కొన్నారు.

News November 2, 2025

HYD: చంచల్‌గూడ జైలుకు ఒమర్ అన్సారీ

image

HYDలోని చాదర్‌ఘాట్ పరిధిలో గల విక్టోరియా ప్లే గ్రౌండ్‌లో గత శనివారం కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిందితుడు ఒమర్ అన్సారీ కోలుకోవడంతో శనివారం పోలీసులు కోర్టులో హాజరు పరిచారు. న్యాయస్థానం 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌కు ఆదేశించడంతో అతడిని చంచల్‌గూడ జైలుకు పోలీసులు తరలించారు.