News March 19, 2025
కరీంనగర్: మాదకద్రవ్యాల నిర్మూలనకు పకడ్బందీ చర్యలు: కలెక్టర్

మాదకద్రవ్యాల నిర్మూలనకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, యువత మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడాలని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. మత్తుపదార్థాల నిర్మూలనలో భాగంగా పోలీస్, ఎక్సైజ్ సహా వివిధశాఖల అధికారులతో బుధవారం ఆమె సమన్వయ సమావేశం నిర్వహించారు. కళాశాలలో వివిధ వసతి గృహాలను సందర్శించాలన్నారు. అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసే విద్యార్థులు పెడదోవ పట్టకుండా చూడాలని ఆదేశించారు.
Similar News
News November 4, 2025
కరీంనగర్: మహిళల రక్షణే షీ టీమ్స్ లక్ష్యం: సీపీ గౌస్ఆలం

మహిళలు, బాలికల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని కరీంనగర్ సీపీ గౌస్ఆలం తెలిపారు. అక్టోబర్ నెలలో జిల్లా వ్యాప్తంగా 42 అవగాహన కార్యక్రమాలు నిర్వహించామన్నారు. ఈక్రమంలో 70 ప్రాంతాల్లో నిఘా పెట్టి, 30 మంది పోకిరీలను పట్టుకుని కౌన్సిలింగ్ ఇచ్చామని తెలిపారు. ఫిర్యాదుల మేరకు 13 మంది వ్యక్తులకు కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు.
News November 3, 2025
మానకొండూరు: పాఠశాల దారి మూసేశారు..!

మానకొండూరు(M) గట్టుదుద్దెనపల్లి ప్రభుత్వ పాఠశాలకు వెళ్లే దారికి ఫెన్సింగ్ వేయడంతో విద్యార్థులు రోడ్డుపైనే నిలబడి చదువుకోవాల్సిన దారుణ పరిస్థితి ఏర్పడింది. ఇన్నాళ్లు ఉన్న దారిని ఒక్కసారిగా ఎందుకు మూసేశారని గ్రామస్థులు, తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భూ వివాదాలా లేక రాజకీయ కారణాలా అని ప్రశ్నిస్తున్నారు. అధికారులు వెంటనే జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.
News November 2, 2025
చాలా రోజుల తర్వాత కనిపించిన కెప్టెన్

చాలా కాలంగా అనారోగ్యంతో రాజకీయాలకు దూరంగా ఉన్న మాజీ మంత్రి కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఆదివారం కనిపించారు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్సార్ మంత్రివర్గంలో పనిచేసి, బీఆర్‌ఎస్‌లో కీలకంగా వ్యవహరించారు. మాజీ మంత్రి హరీశ్ రావు నివాసానికి వెళ్లి ఆయన తండ్రి సత్యనారాయణరావు మృతికి సంతాపం ప్రకటించారు. కుటుంబసభ్యులను పరామర్శించారు.


