News March 19, 2025
KMR: అందరికీ ఆమోదయోగ్య బడ్జెట్: షబ్బీర్ అలీ

TG అసెంబ్లీలో డీప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాల వారికి ఈ ఆమోద యోగ్యమైనదని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. పట్టణాభివృద్ధితో పాటు పల్లెల అభివృద్ధికి ఈ బడ్జెట్లో పెద్దపీట వేశారన్నారు. అలాగే మహిళలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారన్నారు. ప్రభుత్వ సంక్షేమం, అభివృద్ధి రంగాలకే బడ్జెట్లో అధిక నిధులు కేటాయించినట్లు పేర్కొన్నారు.
Similar News
News March 20, 2025
నాగర్‌కర్నూల్: 26 రోజులైనా ఆచూకీ లేదు

SLBC టన్నెల్‌లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బుధవారంతో 26 రోజులైనా కార్మికుల ఆచూకీ లభించలేదు. కేరళకు చెందిన కడావర్ డాగ్స్ గుర్తించిన D1, D2 ఏరియాల్లో ఆయా బృందాలు పనిచేస్తున్నాయి. TBM మిషన్ భాగాలు కత్తిరించి టన్నెల్ నుంచి బయటకు తీసుకొస్తున్నారు. సాంకేతిక కారణాలతో వారం రోజులుగా రోబోల సేవలు అందుబాటులోకి రాలేదు. అడ్డుగా ఉన్న టీబీఎం శకలాలను తొలిగిస్తేనే రోబో సేవలు కొనసాగుతాయని అధికారులు చెబుతున్నారు.
News March 20, 2025
రాష్ట్రంలోనే జమ్మికుంట, హుజూరాబాద్ టాప్

ఇంటిపన్ను వసూళ్లలో హుజూరాబాద్ మున్సిపాలిటీ 100 శాతం లక్ష్యాన్ని సాధించి రాష్ట్రంలోనే మొదటిస్థానంలో నిలిచిందని మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య తెలిపారు. అదేవిధంగా ప్రాపర్టీ ట్యాక్స్ వసూళ్లలో జమ్మికుంట మున్సిపాలిటీ 100% లక్ష్యాన్ని సాధించి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచిందని మున్సిపల్ కమిషనర్ అయాజ్ పేర్కొన్నారు. ఈ ఘనత మున్సిపల్ ప్రజలు, సిబ్బంది వల్లే సాధ్యమైందని ఇరువురు తెలిపారు.
News March 20, 2025
దోమ: WOW.. చదివిన కాలేజీలోనే GOVT ఉద్యోగం

కష్టపడితే ఏదైనా సాధించవచ్చని వికారాబాద్ జిల్లా వాసి నిరూపించారు. దోమ(M) కొండాయిపల్లికి చెందిన జానంపల్లి అనంతయ్య చిన్నప్పుడే తండ్రి చనిపోవడంతో తల్లి కూలి పని చేసి ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం వండి చదివించింది. JL ఎలాగైనా సాధించాలని 14 సంవత్సరాలుగా కష్టపడి చదివి గురుకుల, జూనియర్ లెక్చరర్ ఉద్యోగం సాధించారు. తాను చదివిన వికారాబాద్ డిగ్రీ కాలేజీలోనే పోస్టింగ్ రావడంతో అనంతయ్య సంతోషం వ్యక్తం చేశారు.