News March 19, 2025

అలంపూర్: బీఆర్ఎస్ పార్టీ కొత్త కార్యాలయం ప్రారంభం

image

అలంపూర్ పట్టణంలో ఈరోజు బ్రాహ్మణ వీధి నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహం దగ్గర బీఆర్ఎస్ కొత్త కార్యాలయం ప్రారంభించినట్లు అలంపూర్ పట్టణ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు వెంకటరామయ్య శెట్టి తెలిపారు. గతంలో న్యూ ప్లాట్స్ కాలనీలో ఉండేదని అక్కడి నుంచి అలంపూర్ పట్టణానికి తరలించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకుడు చిలుకూరి శ్రీనివాసులు, సింగిల్ విండో డైరెక్టర్ రమేశ్ గుప్తా తదితరులు ఉన్నారు.

Similar News

News March 20, 2025

దోమ: WOW.. చదివిన కాలేజీలోనే GOVT ఉద్యోగం

image

కష్టపడితే ఏదైనా సాధించవచ్చని వికారాబాద్ జిల్లా వాసి నిరూపించారు. దోమ(M) కొండాయిపల్లికి చెందిన జానంపల్లి అనంతయ్య చిన్నప్పుడే తండ్రి చనిపోవడంతో తల్లి కూలి పని చేసి ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం వండి చదివించింది. JL ఎలాగైనా సాధించాలని 14 సంవత్సరాలుగా కష్టపడి చదివి గురుకుల, జూనియర్ లెక్చరర్ ఉద్యోగం సాధించారు. తాను చదివిన వికారాబాద్ డిగ్రీ కాలేజీలోనే పోస్టింగ్ రావడంతో అనంతయ్య సంతోషం వ్యక్తం చేశారు.

News March 20, 2025

ఎన్టీఆర్: బీటెక్ పరీక్షల రీవాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదల 

image

కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో DEC 2024లో నిర్వహించిన బీటెక్ 1వ సెమిస్టర్ (రెగ్యులర్& సప్లిమెంటరీ) పరీక్షలకు సంబంధించి రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు రీ వాల్యుయేషన్/ పర్సనల్ వెరిఫికేషన్ కోరుకునే విద్యార్థులు మార్చి 24వ తేదీలోగా ఒక్కో పేపరుకు నిర్ణీత ఫీజు రూ.1,000 చెల్లించాల్సి ఉంటుందని వర్సీటీ పరీక్షల విభాగ కంట్రోలర్ తెలిపారు. 

News March 20, 2025

అనంతపురంలో యువతి ఆత్మహత్య

image

అనంతపురంలోని అంబేడ్కర్ కాలనీకి చెందిన మైథిలి అనే యువతి బుధవారం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతురాలి బంధువులు తెలిపిన వివరాల మేరకు.. ఈనెల 10న మైథిలి రసాయన ద్రావణం తాగి ఆత్మహత్యకు యత్నించింది. మెరుగైన వైద్యం కోసం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందిందని తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

error: Content is protected !!