News March 19, 2025

నిర్మల్‌: పోటీ పరీక్షలపై దృష్టి సారించాలి : ఫైజాన్ అహ్మద్

image

విద్యార్థులు డిగ్రీ స్థాయి నుంచి సివిల్ సర్వీస్ పరీక్షలపై దృష్టి సారించాలని అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ అన్నారు. బుధవారం పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన కెరీర్ గైడెన్స్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. విద్యార్థులు గ్రూప్స్ ,సివిల్స్ పరీక్షలకు ప్రణాళికాబద్ధంగా సన్నద్ధమైతే సులభంగా ర్యాంకులను సాధించవచ్చని పేర్కొన్నారు. పోటీ పరీక్షలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.

Similar News

News September 18, 2025

జగిత్యాల: ‘జీపీఎఫ్ ప్రతిపాదనలు నేరుగా జడ్పీలోనే స్వీకరించాలి’

image

ఉపాధ్యాయుల జీపీఎఫ్ ప్రతిపాదనలను గతంలో మాదిరిగానే నేరుగా జడ్పీ కార్యాలయంలోనే స్వీకరించాలని తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ డిమాండ్ చేసింది. టీఆర్‌టీఎఫ్‌ జిల్లా అధ్యక్షులు తుంగూరి సురేష్, ప్రధాన కార్యదర్శి గుర్రం శ్రీనివాస్ గౌడ్ గురువారం జడ్పీ డిప్యూటీ సీఈఓ నరేష్‌కు వినతిపత్రం అందజేశారు.

News September 18, 2025

ఇచ్చోడ: పోలీసులపై దాడి.. ప్రధాన నిందితుడి అరెస్ట్

image

కేశవపట్నంలో ఫారెస్ట్ అధికారులు, పోలీసులపై దాడి చేసిన ప్రధాన నిందితుడు షేక్ అల్తాఫ్ అరెస్ట్ చేసినట్లు ఇచ్చోడ సీఐ బండారి రాజు తెలిపారు. నిందితుడిని గురువారం అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించామని పేర్కొన్నారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలు చేసే వారిపై జిల్లా పోలీస్ యంత్రాంగం కఠినంగా వ్యవహరిస్తుందని, ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టబోమని హెచ్చరించారు.

News September 18, 2025

మంచిర్యాలలో వ్యభిచార గృహంపై పోలీసుల దాడి

image

మంచిర్యాల పట్టణంలోని సూర్య నగర్‌లో వ్యభిచారం జరుగుతుందన్న సమాచారం మేరకు ఏసీపీ ప్రకాశ్ ఆదేశాలతో సీఐ ప్రమోద్ రావు ఆధ్వర్యంలో ఎస్ఐ తిరుపతి గురువారం సిబ్బందితో కలిసి దాడులు చేశారు. ఓ ఇంట్లో బాదే రాజమణి, సమీల రాకేశ్ వ్యభిచారం నిర్వహిస్తున్నారని, వారితోపాటు విటులు కొండ విజయ్, కావేటి సురేశ్‌ను అరెస్ట్ చేశామని ఎస్ఐ తెలిపారు. ఈ మేరకు వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.