News March 19, 2025
తిరుపతి: కప్ కైవసం చేసుకున్న పోలీస్ జట్టు

తిరుపతి తారకరామా స్టేడియంలో జరిగిన మెగా కార్పొరేట్ క్రికెట్ లీగ్ T-20 టోర్నమెంట్‌లో అమర్ రాజా టీంపై పోలీస్ జట్టు ఘనవిజయం సాధించింది. క్రికెట్ ట్రోర్నమెంట్ లో రాఘవులు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు తీసుకున్నారు. ఆరు మ్యాచ్‌లలో 572 పరుగులు సాధించి అతను ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచాడు. ఈ సందర్భంగా తిరుపతి ఎస్పీ హర్షవర్దన్ రాజు వారిని అభినందించారు.
Similar News
News March 20, 2025
HCA మాజీ కోశాధికారి ఆస్తి సీజ్

TG: ఉప్పల్ స్టేడియం ఆధునీకరణ పనుల్లో జరిగిన అక్రమాలపై దర్యాప్తులో ఈడీ పట్టు బిగించింది. HCA మాజీ కోశాధికారి సురేందర్ అగర్వాల్ చేసిన అవినీతిపై ఆధారాలతో ED రూ.90.86 లక్షల అక్రమ సొమ్మును సీజ్ చేసింది. అజహరుద్దీన్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో జరిగిన పనుల్లో క్విడ్ ప్రోకో కింద అపెక్స్ సభ్యులు అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలున్నాయి. సురేందర్ కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాలకు నగదు బదిలీ అయినట్లు విచారణలో తేలింది.
News March 20, 2025
సంచిలో ట్రాన్స్‌జెండర్ తల, చేయి లభ్యం

అనకాపల్లి జిల్లాలో ట్రాన్స్‌జెండర్ హత్య కలకలం రేపింది. కశింకోట మండలం బయ్యవరంలో హంతకుడు ఆమె నడుము కింది భాగం, కాలు, చేయి మూట కట్టి పడేశాడు. దీంతో జిల్లా ఇన్‌ఛార్జ్ ఎస్పీ వకుల్ జిందాల్ 8 టీమ్‌లతో దర్యాప్తు చేపట్టి చనిపోయింది దీపుగా గుర్తించారు. అయితే ఆమె తల, మరో చేయి అనకాపల్లి వై జంక్షన్ వద్ద సంచిలో దొరికాయి.
News March 20, 2025
రెండో రోజు 352 మంది గైర్హాజరు

అనంతపురం జిల్లా వ్యాప్తంగా బుధవారం పదో తరగతి విద్యార్థులకు సెకండ్ లాంగ్వేజ్ ఎగ్జామ్ జరిగింది. 135 కేంద్రాల్లో పరీక్షలు జరగ్గా 352 మంది గైర్హాజరు అయ్యారు. 30,862 మందికి గానూ 30,537 మంది హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ డా.వినోద్ కుమార్ రాంనరగ్‌లోని శ్రీచైతన్య పాఠశాలలో A, B పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు నిర్వహించాలని సిబ్బందికి సూచించారు.