News March 24, 2024
ఆయన నుంచి చాలా నేర్చుకున్నా: గిల్
రోహిత్ శర్మ నుంచి చాలా నేర్చుకున్నానని గుజరాత్ కెప్టెన్ గిల్ అన్నారు. ఆయన నాయకత్వంలో చాలా క్రికెట్ ఆడానని చెప్పారు. రోహిత్ నుంచి వ్యక్తిగతంగా అనేక లక్షణాలను అలవరచుకున్నానని తెలిపారు. టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ధోనీ తనకు స్ఫూర్తి అని చెప్పారు. అయితే ధోనీ నాయకత్వంలో ఆడలేకపోయానని.. విరాట్ సారథ్యంలో కొన్ని మ్యాచులు ఆడానని పేర్కొన్నారు.
Similar News
News November 5, 2024
లారెన్స్ బిష్ణోయ్ ఫొటోలతో టీషర్ట్లు.. విమర్శలు!
ఈకామర్స్ వెబ్సైట్ మీషోలో గ్యాంగ్స్టర్ల ఫొటోలతో టీషర్టులు అమ్మడం చర్చనీయాంశంగా మారింది. బాలీవుడ్ స్టార్ సల్మాన్‌ఖాన్‌ను చంపేస్తానని వార్నింగ్ ఇచ్చిన లారెన్స్ బిష్ణోయ్ ఫొటోలతో ఉన్న టీషర్టులను మీషోలో విక్రయించడాన్ని పలువురు తప్పుబడుతున్నారు. మరో గ్యాంగ్‌స్టర్ దుర్లభ్ కశ్యప్ ఫొటోలతోనూ టీషర్టులు అందుబాటులో ఉన్నాయి. ఇలాంటి వాటితో యువతలో నేరపూరిత ఆలోచనలు పుట్టుకొస్తాయని అంటున్నారు.
News November 4, 2024
DANGER: డైలీ ఎంత ఉప్పు తింటున్నారు?
ఉప్పుతో ఆహారానికి రుచి. అందుకే చాలామంది తినాల్సిన దానికంటే అధికంగా ఉప్పు తింటున్నారు. అయితే ఉప్పు ఎక్కువ లేక తక్కువ తిన్నా ప్రాణాలకు ప్రమాదమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఏటా దాదాపు 20లక్షల మరణాలకు ఉప్పు కారణమవుతోందంటున్నారు. ఒక వ్యక్తి రోజుకు 5గ్రా.లు లేదా టీస్పూన్ ఉప్పు వాడాలని WHO చెబుతోంది. కానీ చాలామంది 11గ్రాములు తీసుకుంటున్నారు. అందుకే కొన్ని దేశాలు ఉప్పు వాడకం తగ్గించడంపై ఫోకస్ పెట్టాయి.
News November 4, 2024
పంచాయతీ కార్యదర్శులు స్థానికంగానే నివాసం ఉండాలి: మంత్రి
TG: గ్రామ పంచాయతీ కార్యదర్శులు స్థానికంగానే నివాసం ఉండాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు. పనిలో నిర్లక్ష్యం వహించే వారిపై వేటు వేయాలని అధికారులకు సూచించారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెంలో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఆయన అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.