News March 19, 2025

కృష్ణా: 10వ తరగతి సెకండ్ లాంగ్వేజ్ పరీక్ష ప్రశాంతం

image

10వ తరగతి పరీక్షల్లో భాగంగా రెండవ రోజైన బుధవారం నిర్వహించిన సెకండ్ లాంగ్వేజ్ (హిందీ) పరీక్ష జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. 21,504 మంది విద్యార్థులకు గాను 21,026 మంది విద్యార్థులు హాజరయ్యారు. హాజరు శాతం 97.78% నమోదైంది. 33 పరీక్షా కేంద్రాలను స్క్వాడ్ అధికారులు తనిఖీ చేయగా ఎటువంటి మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు కాలేదని డీఈఓ రామారావు తెలిపారు. 

Similar News

News March 20, 2025

కష్ణా: ‘డాక్టర్ శ్రీహరి హత్య కేసు దోషులను పట్టుకోవాలి’

image

కృష్ణాజిల్లా అవనిగడ్డలో డా. కే శ్రీహరి హత్య కేసు దోషులను పట్టుకోవాలని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ కోరారు. గురువారం అసెంబ్లీ సమావేశాలలో ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంలో 2020వ సంవత్సరంలో వివేకానంద రెడ్డి హత్య తరహాలోనే డాక్టర్ కోట శ్రీహరిరావు హత్య జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వం ప్రకటించిన విధంగా సీబీసీఐడి విచారణ చేపట్టి డాక్టర్ కోట శ్రీహరి హంతకులను పట్టుకోవాలని కోరారు.

News March 20, 2025

గన్నవరం: బాలికపై అఘాయిత్యం.. వెలుగులోకి కీలక విషయాలు

image

గన్నవరం మండలంలో బాలికపై అత్యాచార ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నెల 13న గుర్తుతెలియని వ్యక్తులు ఆమెను అపహరించి 14 మధ్యాహ్నం వరకు పారిశ్రామికవాడలో నిర్బంధించారు. 14న కేసరపల్లిలో ఖాళీ గదికి తరలించి, 17వరకు మద్యం, గంజాయి ఇచ్చి బాలికపై అత్యాచారం చేశారు. అనంతరం విజయవాడలో వదిలేశారు. పోలీసులు నిందితులను పట్టుకున్నారు. వారంతా గంజాయి కేసుల్లో పాత నేరస్థులని గుర్తించారు.

News March 20, 2025

కృష్ణా జిల్లాలో ఇద్దరు ఇన్విజిలేటర్లు సస్పెండ్ 

image

పదో తరగతి పరీక్షల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన తాడిగడప ఎంపీపీ ఎస్ మెయిన్ పాఠశాల ఇన్విజిలేటర్‌‌ను డీఈవో రామారావు సస్పెండ్ చేశారు. గైర్హాజరైన విద్యార్థి స్థానంలో మరొకరు పరీక్ష రాయడాన్ని గమనించకుండా బాధ్యతా రహితంగా వ్యవహరించడంతో ఈ చర్య తీసుకున్నారు. కంకిపాడులో ప్రశ్నపత్రం మార్పిడి ఘటనలో మరో ఇన్విజిలేటర్‌ను కూడా సస్పెండ్ చేశారు.

error: Content is protected !!