News March 19, 2025
VZM: ZP ఛైర్మన్‌కు మాజీ CM జగన్ పరామర్శ

విజయనగరం జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాస్ రెండో కుమారుడు ప్రణీత్ బాబు బుధవారం మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మాజీ సీఎం వైఎస్ జగన్ ఫోన్‌లో చిన్న శ్రీనును పరామర్శించారు. మృతికి గల కారణాన్ని అడిగి తెలుసుకున్నారు. చిన్న శ్రీను కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లోనే మనోధైర్యంగా ఉండాలంటూ జగన్ ధైర్యం చెప్పారు.
Similar News
News March 20, 2025
విశాఖలో రేషన్ కార్డు ఉన్నవారికి గమనిక

విశాఖలో మొత్తం 15,91,448 రైస్ కార్డుల సభ్యులకుగాను 1,64,985 సభ్యులకు ఈకేవైసీ అవ్వలేదని పౌరసరఫరాల శాఖాధికారిణి కళ్యాణి బుధవారం తెలిపారు. ఈకేవైసీ నమోదు కానీ వారి జాబితా సచివాలయంలో, ఏఎస్‌వో, తహశీల్దార్ కార్యాలయాల్లో ఉంటుందన్నారు. 6-60 ఏళ్ల లోపు వారు దగ్గరలో రేషన్ డిపోలో మార్చ్ 31వ తేద లోపు ఈకేవైసీ చేసుకోవాలని సూచించారు. ఈకేవైసీ అవ్వకుంటే రేషన్ నిలిచిపోయే ప్రమాదం ఉందని వెల్లడించారు.
News March 20, 2025
శ్రీకాకుళం: ఈ మండలాలకు ఆరెంజ్ అలర్ట్

శ్రీకాకుళం జిల్లాలో నేడు ఈ మండలాల్లో అధిక ఉష్ణోగ్రతలతో పాటు వడగాలులు వీస్తాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) హెచ్చరించింది. ప్రజలు వడగాలులకు గురవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తూ తమ అధికారిక ‘X’ ఖాతా ద్వారా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. పొందూరు 38.2, ఆమదాలవలస 38.5, జి.సిగడాం 39.3, జలుమూరు 38.7, సరుబుజ్జిలి 39.2, సారవకోట 38.9, బూర్జ 39.5, నరసన్నపేట 37.6 ఈ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది.
News March 20, 2025
వరంగల్: నేడు జాబ్ మేళా దరఖాస్తుల ఆహ్వానం..

ములుగు రోడ్డులోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఉన్న జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో గురువారం జాబ్ మేళా నిర్వహిస్తున్నామని జిల్లా ఉపాధి కల్పన అధికారి ఎం.మల్లయ్య తెలిపారు. ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులని ఆసక్తి గల నిరుద్యోగ యువతీ యువకులు తమ బయోడేటా, విద్యార్హత సర్టిఫికెట్లు, జిరాక్స్ కాపీలతో ఉదయం 11.00 గంటలకు జాబ్ మేళాకు హాజరు కావాలని మరిన్ని వివరాలకు 9848895937 నంబర్లు సంప్రదించాలని కోరారు.