News March 19, 2025
బాపట్ల: రూ.149 కోట్ల పనులు మంజూరు

జలజీవన్ మిషన్ద కింద జిల్లాకు రూ.149 కోట్లతో 337 పనులు మంజూరు అయ్యాయని బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకట మురళి అన్నారు. బుధవారం బాపట్ల కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జిల్లా స్థాయి సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జలజీవన్ మిషన్ క్రింద ప్రభుత్వం మంజూరు చేసిన పనులకు టెండర్లు పిలవాలని అధికారులను ఆదేశించారు.
Similar News
News January 12, 2026
ప్రొద్దుటూరులో నేటి బంగారు, వెండి ధరలు.!

* బంగారు 24 క్యారెక్టర్ ఒక గ్రాము ధర రూ.14,290
* బంగారు 22 క్యారెక్టర్ ఒక గ్రాము ధర రూ.13,147
* వెండి 10 గ్రాములు ధర రూ.2,620.
News January 12, 2026
NLG: జిల్లాలో పెరుగుతున్న రాజకీయ వేడి!

మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సర్కారు అడుగులు వేస్తుండడంతో బల్దియాల్లో రాజకీయం వేడెక్కుతోంది. ఓటర్ల తుది జాబితా ప్రకటనకు ముందే రిజర్వేషన్లు ఎలా ఉంటాయి, అనుకూలించకపోతే ఏం చేయాలన్న విషయమై ఆశావహులు లెక్కలు వేసుకుంటున్నారు. NLG జిల్లాలో ప్రధానంగా NLG (ఇప్పుడు కార్పొరేషన్), MLG, CTL, DVK, HLY, CDR, నందికొండ, నకిరేకల్ వంటి మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇవాళ వార్డుల వారిగా తుది ఓటర్ల జాబితాను ప్రదర్శించనున్నారు.
News January 12, 2026
పోలవరం-నల్లమల సాగర్ కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు

పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌కు అర్హత లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇతర ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పరిష్కారం పొందేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో TG ప్రభుత్వం పిటిషన్‌ను ఉపసంహరించుకుంది. సివిల్ సూట్ ఫైల్ చేస్తామని ప్రభుత్వ తరఫు న్యాయవాది అభిషేక్ సింఘ్వీ తెలిపారు. కాగా గోదావరి జలాల విషయంలో MH, కర్ణాటక వాదనలు కూడా వినాల్సి ఉందని ధర్మాసనం పేర్కొంది.


