News March 19, 2025

KMM: ప్రజాస్వామ్య స్పూర్తి సంరక్షణలో భాగస్వామ్యం కావాలి: కలెక్టర్

image

ప్రజాస్వామ్య స్ఫూర్తి సంరక్షణలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. కవిత మెమోరియల్ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొని, కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యానికి ప్రతిరూపమే పార్లమెంట్ వ్యవస్థ అన్నారు.

Similar News

News March 20, 2025

ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

∆} ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన ∆} వివిధ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం ∆} మధిరలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ పర్యటన ∆} వియ్యం బంజర సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు ∆} వైరాలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన ∆} ఖమ్మం నగరంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న ఇంటర్ పరీక్షలు.

News March 20, 2025

KCR నియంతలా వ్యవహరించారు: గుమ్మడి నరసయ్య

image

ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటికీ.. సామాన్యుడిలా జీవితం గడుపుతున్న కమ్యూనిస్ట్ పార్టీ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య మాజీ CM KCRపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ అన్నీ తానే అనే పద్ధతిలో, ఒక నియంతలా వ్యవహరించారని ఆరోపించారు. ఆయన మంత్రులను, పార్టీ నేతలను ఎవ్వరినీ దగ్గరకు కూడా రానివ్వడని తెలిపారు. ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి జనాలతో మమేకం అవుతున్నారని, రేవంత్ ప్రజల మనిషి అంటూ అభినందించారు.

News March 20, 2025

ఉమ్మడి ఖమ్మంలో ప్రాజెక్టులకు రూ.770 కోట్లు

image

అసెంబ్లీలో బుధవారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యతనిస్తూ, నిధులు దండిగా కేటాయించారు. సీతారామకు రూ.699.53 కోట్లు, ఎర్రుపాలెం(ఎల్ఐ) రూ.39.93 కోట్లు, కిన్నెరసానికి రూ.13.33 కోట్లు, తాలిపేరు రూ.7.30 కోట్లు, భక్తరామదాసు రూ.9 లక్షలు, లంకాసాగర్ రూ.1లక్ష కేటాయించారు. వ్యవసాయరంగానికి ఊతమిచ్చేలా జిల్లాకు నిధులు కేటాయించారని రైతాంగం హర్షం వ్యక్తం చేస్తుంది.

error: Content is protected !!