News March 19, 2025
హాస్టల్‌లో మెరుగైన సౌకర్యాలు ఉండాలి: హనుమకొండ కలెక్టర్

హాస్టల్‌లో విద్యార్థులకు సౌకర్యాలు మెరుగ్గా ఉండేలా చర్యలు చేపట్టాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య అన్నారు. బుధవారం హనుమకొండ నయీమ్ నగర్‌లోని బీసీ సంక్షేమ హాస్టల్‌ను జిల్లా కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా హాస్టల్లో విద్యార్థులు ఎంతమంది ఉన్నారు?, సౌకర్యాలు ఎలా ఉన్నాయని బీసీ సంక్షేమ అధికారి రామ్ రెడ్డి, హాస్టల్ అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.
Similar News
News September 17, 2025
తాడేపల్లి: తిరుమల బ్రహ్మోత్సవాలకు సీఎం చంద్రబాబుకు ఆహ్వానం

ఈనెల 24 నుంచి అక్టోబర్ 2 వరకు తిరుమల శ్రీవారి ఆలయంలో జరగనున్న సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబుని టీటీడీ ఆహ్వానించింది. బుధవారం సీఎం క్యాంప్ కార్యాలయంలో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ముఖ్యమంత్రిని కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. పండితులు సీఎంను ఆశీర్వదించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు.
News September 17, 2025
భువనగిరి: ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి

భువనగిరి-చిట్యాల ప్రధాన రహదారిపై న్యూ డైమెన్షన్ స్కూల్ సమీపంలో రోడ్డుప్రమాదం జరిగింది. లూనాపై వెళ్తున్న వ్యక్తిని బస్సు ఢీకొట్టడంతో వ్యక్తి మృతి చెందాడు. మృతుడు అనాజిపురానికి చెందిన బాలయ్య గౌడ్‌గా గుర్తించారు. అతను భువనగిరి వైపు వెళ్తుండగా వెనుక నుంచి అతివేగంతో ఆర్టీసీ బస్సు ఢీ కొట్టిందని స్థానికులు తెలిపారు. మృతుడు కల్లుగీత కార్మికుడు. న్యాయం చేయాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.
News September 17, 2025
HYD: 5 ప్రాంతాల్లో ఫ్లై ఓవర్లు

నాగార్జునసాగర్ రింగ్ రోడ్డు- శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ రాకపోకలు సాగించేవారికి సిగ్నల్ ఫ్రీ ప్రయాణం కోసం మరో 5 ప్రాంతాల్లో ఫ్లైఓవర్లు, RUBల నిర్మాణాలకు GHMC సిద్ధమవుతోంది. TKR కమాన్, ఒమర్ హోటల్, బండ్లగూడ, మైలార్‌దేవ్‌పల్లి, ఆరాంఘర్ ప్రాంతాల్లో నిర్మించనున్నారు. త్వరలోనే ఫీజిబిలిటీ స్టడీ, DPRలు పూర్తిచేసి పనులు చేపట్టనున్నట్లు సంబంధిత ఇంజినీర్లు తెలిపారు.