News March 19, 2025
టాటా ఇన్నోవేషన్ సెంటర్‌కు భూ సేకరణ: అనంత కలెక్టర్

రతన్ టాటా ఇన్నోవేషన్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు భూసేకరణ చేపట్టాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం అనంతపురం నగరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలోని జిల్లా స్కిల్ డెవలప్మెంట్ కార్యాలయం వద్ద ఉన్న భూమి, సెంట్రల్ యూనివర్సిటీ అడ్మిన్ బిల్డింగ్‌ను ఆయన పరిశీలించారు. 24గంటల్లో స్థల పరిశీలన చేయాలని జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారి, సర్వే AD, MROలను కలెక్టర్ ఆదేశించారు.
Similar News
News March 20, 2025
అనంతపురంలో యువతి ఆత్మహత్య

అనంతపురంలోని అంబేడ్కర్ కాలనీకి చెందిన మైథిలి అనే యువతి బుధవారం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతురాలి బంధువులు తెలిపిన వివరాల మేరకు.. ఈనెల 10న మైథిలి రసాయన ద్రావణం తాగి ఆత్మహత్యకు యత్నించింది. మెరుగైన వైద్యం కోసం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందిందని తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
News March 20, 2025
అనంత: రెవెన్యూ సెక్టార్‌పై వీడియో కాన్ఫరెన్స్

అనంతపురం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ నుంచి రెవెన్యూ సెక్టార్‌పై డీఆర్ఓ, ఆర్డీఓలు, జిల్లా రిజిస్టర్, తహశీల్దార్లు, మండల సర్వేయర్లు, ఆర్ఎస్డీటీలు, ఎస్ఆర్ఓలు తదితరులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ బుధవారం సాయంత్రం సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ సెక్టర్‌లో అవకతవకలు జరిగితే ఏ ఒక్క అధికారిని ఉపేక్షించే పరిస్థితి ఉండదని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు.
News March 20, 2025
అనంతపురం: 100% ఇంటింటి చెత్త సేకరణ.!

క్షేత్రస్థాయిలో 100% ఇంటింటి చెత్త సేకరణ చేపట్టాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం అనంతపురం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్ నుంచి SWPC షెడ్లు, GSWS అంశాలపై DPO, MPDO, మున్సిపల్ కమిషనర్లు, DLDO అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. జిల్లాలో 56చోట్ల SWPC షెడ్లు పనిచేయడం లేదని.. వాటి బాధ్యత అధికారులపై ఉందన్నారు.