News March 19, 2025

సిద్దిపేట: కస్తూర్భాను తనిఖీ చేసిన అదనపు కలెక్టర్

image

చేర్యాల మండల కేంద్రంలోని కస్తూర్బా బాలికల పాఠశాలను జిల్లా అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ తనిఖీ చేశారు. అనంతరం టెన్త్ క్లాస్ విద్యార్థినులకు కాసేపు పాఠాలు బోధించారు. వారు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ శ్రద్ధతో చదవాలని, ఎలాంటి సందేహాలు ఉన్నా ఉపాధ్యాయులతో చర్చించి నివృత్తి చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా పాఠశాలలోని వసతి రూం, కిచెన్ సందర్శించి మెనూ ప్రకారమే నాణ్యమైన భోజనం అందించాలని ప్రిన్సిపల్ కు సూచించారు.

Similar News

News March 20, 2025

రామచంద్రపురం : పోలీసుల ఎదుట లొంగిపోయిన కసాయి తండ్రి

image

ఇద్దరు కన్న బిడ్డలను కాలువలో తోసేసి పరారైన రాయవరం (M) వెంటూరుకు చెందిన పిల్లి రాజు బుధవారం రామచంద్రపురం పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు సమాచారం. సోమవారం నెలపర్తిపాడు శివారు గణపతి నగరం సమీపంలోని పంట కాలువలో కారుణ్యశ్రీ (7), రామ సందీప్‌(10)ను తండ్రి రాజు పంట కాలువలో తోసేసిన విషయం తెలిసిందే. కారుణ్యశ్రీ మృత్యువాత పడగా సందీప్ ప్రాణాలు దక్కించుకున్నాడు.

News March 20, 2025

ఉమ్మడి ఖమ్మంలో ప్రాజెక్టులకు రూ.770 కోట్లు

image

అసెంబ్లీలో బుధవారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యతనిస్తూ, నిధులు దండిగా కేటాయించారు. సీతారామకు రూ.699.53 కోట్లు, ఎర్రుపాలెం(ఎల్ఐ) రూ.39.93 కోట్లు, కిన్నెరసానికి రూ.13.33 కోట్లు, తాలిపేరు రూ.7.30 కోట్లు, భక్తరామదాసు రూ.9 లక్షలు, లంకాసాగర్ రూ.1లక్ష కేటాయించారు. వ్యవసాయరంగానికి ఊతమిచ్చేలా జిల్లాకు నిధులు కేటాయించారని రైతాంగం హర్షం వ్యక్తం చేస్తుంది.

News March 20, 2025

ఉమ్మడి ఖమ్మంలో ప్రాజెక్టులకు రూ.770 కోట్లు

image

అసెంబ్లీలో బుధవారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యతనిస్తూ, నిధులు దండిగా కేటాయించారు. సీతారామకు రూ.699.53 కోట్లు, ఎర్రుపాలెం(ఎల్ఐ) రూ.39.93 కోట్లు, కిన్నెరసానికి రూ.13.33 కోట్లు, తాలిపేరు రూ.7.30 కోట్లు, భక్తరామదాసు రూ.9 లక్షలు, లంకాసాగర్ రూ.1లక్ష కేటాయించారు. వ్యవసాయరంగానికి ఊతమిచ్చేలా జిల్లాకు నిధులు కేటాయించారని రైతాంగం హర్షం వ్యక్తం చేస్తున్నారు.

error: Content is protected !!