News March 19, 2025
KMR: విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి

కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండలం బస్వాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న ఆరోగ్య ఉపకేంద్ర నిర్మాణ పనుల్లో అపశృతి చేసుకుంది. మెదక్ జిల్లా రామాయంపేటకు చెందిన రాములు(42) అనే వ్యక్తికి బుధవారం పని చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ వైర్లు తాకడంతో అతను అక్కడికక్కడే మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. ఈ విషయాన్ని స్థానిక పోలీసులకు సమాచారం అందించారు.
Similar News
News March 20, 2025
ఆ ఉద్యోగులకు భారీగా పెరగనున్న జీతాలు

దేశంలోని గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల(GCC)లో పని చేసే ఉద్యోగుల వేతనాలు వచ్చే ఏడాదిలో 9.8% మేర పెరగనున్నట్లు ఓ నివేదిక అంచనా వేసింది. ఉద్యోగుల వేతనాల వృద్ధిలో GCCలు IT కంపెనీలను మించిపోయాయంది. 2030 నాటికి వీటి మార్కెట్ విలువ 11,000కోట్ల డాలర్లకు చేరవచ్చని పేర్కొంది. దీంతో నైపుణ్యాలున్న ఉద్యోగులకు వేతనాలు గణనీయంగా పెరుగుతాయంది. ప్రస్తుతం హైదరాబాద్, ముంబై GCCలు అధిక జీతాలు చెల్లిస్తున్నాయి.
News March 20, 2025
ప్రకాశం: 22న జిల్లా స్థాయి హాకీ జట్ల ఎంపికలు.!

ప్రకాశం జిల్లా హాకీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 22న సంతనూతలపాడు మండలంలోని మైనంపాడులో గేమ్స్ జరగనున్నాయి. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జిల్లా జూనియర్ బాల,బాలికల హాకీ జట్ల ఎంపికలు నిర్వహించనున్నట్లు జిల్లా హాకీ అసోసియేషన్ అధ్యక్షు, కార్యదర్శులు ఏవి.రమణారెడ్డి, ఏ. సుందరరామిరెడ్డి తెలిపారు. హాకీపట్ల ఆసక్తి గల క్రీడాకారులు ధ్రువీకరణ పత్రాలతో రావాలని పేర్కొన్నారు.
News March 20, 2025
రామచంద్రపురం : పోలీసుల ఎదుట లొంగిపోయిన కసాయి తండ్రి

ఇద్దరు కన్న బిడ్డలను కాలువలో తోసేసి పరారైన రాయవరం (M) వెంటూరుకు చెందిన పిల్లి రాజు బుధవారం రామచంద్రపురం పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు సమాచారం. సోమవారం నెలపర్తిపాడు శివారు గణపతి నగరం సమీపంలోని పంట కాలువలో కారుణ్యశ్రీ (7), రామ సందీప్(10)ను తండ్రి రాజు పంట కాలువలో తోసేసిన విషయం తెలిసిందే. కారుణ్యశ్రీ మృత్యువాత పడగా సందీప్ ప్రాణాలు దక్కించుకున్నాడు.