News March 19, 2025
ADB: ‘స్వయం ఉపాధి ద్వారా యువత లబ్ధి పొందాలి’

స్వయం ఉపాధి పథకాల ద్వారా యువకులు లబ్ధి పొందాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా బుధవారం తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేసిన రాజీవ్ యువ వికాసం పథకానికి అన్ని వర్గాల యువత దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆధార్, కుల, ఆదాయ, పాన్ కార్డ్ తదితర వివరాలను ఉపయోగించి వెబ్సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు.
Similar News
News March 20, 2025
ఆదిలాబాద్: నియోజకవర్గానికి 3500 ఇళ్ల మోక్షం

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్లో సంక్షేమ రంగాలకు అధిక ప్రాధాన్యం కనిపిస్తోంది. ప్రభుత్వం అభయహస్తం కింద అమలు చేస్తున్న ఆరు గ్యారంటీలకు నిధులు కేటాయించింది. దీంతో తొలి విడతలో చేపట్టనున్న నియోజకవర్గానికి 3500 చొప్పున ఇళ్ల నిర్మాణానికి మోక్షం లభించనుంది. ఉమ్మడి జిల్లాలో 35 వేల మందికి లబ్ది చేకూరనుంది. గృహజ్యోతి కింద 3.60లక్షల మందికి లాభం జరగనుంది. పింఛన్‌ల లబ్ధిదారుల సంఖ్య రెట్టింపు కానుంది.
News March 20, 2025
ఆదిలాబాద్: 22న యువజన ఉత్సవ పోటీలు

ADB ప్రభుత్వ డిగ్రీ కళాశాల (సైన్స్)లో మార్చ్ 22న జిల్లాస్థాయి యువజన ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ జే.సంగీత, నెహ్రూ యువజన కేంద్ర జిల్లా కోఆర్డినేటర్ సుశీల్ బడ్ ప్రకటనలో పేర్కొన్నారు. పోటీల్లో 15-29 వయసున్న డిగ్రీ చదివినా లేదా చదువుతున్న యువతీ యువకులు పాల్గొనవచ్చని పేర్కొన్నారు. పెయింటింగ్, మొబైల్ ఫొటోగ్రఫీ, కవితా రచన, ఉపన్యాసం, సాంస్కృతిక నృత్య విభాగంలో పోటీలు ఉంటాయన్నారు.
News March 20, 2025
ADB: రిమ్స్‌లో అన్ని డెలివరీలు చేయాలి: కలెక్టర్

రిమ్స్ ఆసుపత్రికి వచ్చే రోగులకు వైద్య సేవలు అందించడంలో వైద్యులు వైద్య సిబ్బంది ముందుండాలని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. రిమ్స్ వైద్య కళాశాలలో బుధవారం అన్ని శాఖల ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లతో సమీక్ష నిర్వహించారు. రిమ్స్ ఆస్పత్రికి వచ్చే వారందరూ పేద ప్రజలేనని.. వారిని దృష్టిలో ఉంచుకొని వైద్య సేవలు అందించాలన్ నారు. ముఖ్యంగా గైనకాలజీ డిపార్ట్మెంట్లో అన్ని రకాల డెలివరీస్ చేయాలని పేర్కొన్నారు.