News March 19, 2025
సిద్దరామయ్య ఫ్లైట్ జర్నీకి రూ.31 కోట్లు.. తీవ్ర విమర్శలు

రెండేళ్లలో కర్ణాటక CM సిద్దరామయ్య విమాన ప్రయాణానికి రూ.31 కోట్లు ఖర్చు చేశారు. దీనిపై ప్రతిపక్షం తీవ్ర విమర్శలు చేస్తోంది. ఢిల్లీకి రానుపోనూ విమాన ఛార్జీ రూ.70 వేలకు మించదని, అలాంటిది ఛార్టర్ ఫ్లైట్లో వెళ్తూ ఒక ట్రిప్కే రూ.44.40 లక్షలు వృథా చేస్తున్నారని మండిపడుతోంది. రూ.10.85 లక్షలు ఖర్చు చేసి బెంగళూరు నుంచి మైసూరుకు కూడా హెలికాప్టర్లో ప్రయాణిస్తున్నారని విమర్శిస్తోంది.
Similar News
News March 20, 2025
యువతిపై రేప్.. వీడియో తీసిన మరో యువతి

TG: సూర్యాపేట (D) హుజూర్నగర్లో ఓ యువతిపై అత్యాచారం ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హుజూర్నగర్కు చెందిన రోజా తన స్నేహితురాలి(26)ని ఇంటికి పిలిచింది. ఆపై మద్యం తాగించి మత్తులోకి వెళ్లాక రోజా ప్రియుడు ప్రమోద్ ఆ యువతిపై అత్యాచారం చేయగా ఆమె వీడియో తీసింది. బుధవారం మరోసారి ఆ యువతికి ఫోన్ చేసి పిలిపించారు. ఈ సారి తన ఫ్రెండ్ హరీశ్ కోరిక తీర్చాలని ప్రమోద్ కోరగా ఆమె నిరాకరించి పోలీసులను ఆశ్రయించారు.
News March 20, 2025
‘కోర్టు’ కలెక్షన్లలో తగ్గేదేలే..

‘కోర్టు’ మూవీ కలెక్షన్ల పర్వం కొనసాగుతోంది. విడుదలైన ఆరు రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.36.85 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు చిత్ర యూనిట్ ట్వీట్ చేసింది. అభిమానుల తీర్పుతో ఈ సినిమా బాక్సాఫీసు వద్ద బ్లాక్ బస్టర్గా నిలిచిందని పేర్కొంది. రామ్ జగదీశ్ తెరకెక్కించిన ఈ మూవీలో ప్రియదర్శి, శివాజీ, హర్ష్ రోషన్, శ్రీదేవి కీలక పాత్రల్లో నటించారు.
News March 20, 2025
వారి ఉపాధి పరిరక్షణ బాధ్యత కూటమి ప్రభుత్వానిదే: జనసేన

AP: కొల్లేరు విధ్వంసంపై జనసేన ప్రకటన విడుదల చేసింది. కొల్లేరు సమస్య తీవ్రం కావడానికి రాజకీయాలే కారణమని పేర్కొంది. నాటి వైఎస్ ప్రభుత్వం ఆపరేషన్ కొల్లేరు పేరుతో చెరువు గట్లను పేల్చేసిందని దుయ్యబట్టింది. కొల్లేరుపై ఆధారపడిన వారి ఉపాధిని పరిరక్షించాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వానిదేనని పేర్కొంది. పర్యావరణాన్ని పరిరక్షించే సిద్ధాంతం తమదని తెలిపింది.