News March 19, 2025

రేపు విశాఖలో వైసీపీ ధర్నా

image

AP: విశాఖలోని వైఎస్సార్ క్రికెట్ స్టేడియం పేరును తొలగించడాన్ని నిరసిస్తూ రేపు నగరంలో వైసీపీ ధర్నాకు పిలుపునిచ్చింది. ‘వైజాగ్ ప్రగతికి రాచబాటలు వేసిన వైఎస్సార్‌ను కూటమి ప్రభుత్వం తీవ్రంగా అవమానించింది. ఆయన ఆనవాళ్లను చెరిపేసేలా సర్కారు చేస్తున్న కుట్రను ప్రజలకు తెలియజెప్పేందుకు రేపు వైఎస్ అభిమానులు, పార్టీ నాయకులు ఉద్యమానికి సిద్ధమవుతున్నారు’ అని ట్వీట్ చేసింది.

Similar News

News March 20, 2025

మన ‘సంతోషం’ తక్కువేనట..

image

ప్రపంచ సంతోష సూచీలో వరుసగా 8వ సారి ఫిన్లాండ్ తొలి స్థానంలో నిలిచింది. 147 దేశాలతో కూడిన ఈ జాబితాలో భారత్ 118వ స్థానంలో నిలిచింది. పొరుగు దేశాలు నేపాల్(92), PAK(109) భారత్ కంటే ముందు స్థానాల్లో ఉన్నాయి. అయితే గత ఏడాది(126)తో పోలిస్తే ఇండియా తన పొజిషన్‌ను కాస్త మెరుగుపరుచుకుంది. కాగా సామాజిక మద్దతు, ఆయుర్దాయం, స్వేచ్ఛ, దాతృత్వం, అవినీతి వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈ ర్యాంకులు ఇస్తారు.

News March 20, 2025

భారత జట్టుకు భారీ నజరానా

image

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచిన భారత జట్టుకు బీసీసీఐ రూ.58 కోట్ల నజరానా ప్రకటించింది. ఆటగాళ్లతో పాటు సిబ్బంది, సెలక్షన్ కమిటీకి ఈ నగదు అందజేయనున్నట్లు తెలిపింది. మార్చి 9న న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్లో భారత జట్టు విజయం సాధించిన సంగతి తెలిసిందే. కాగా ఐసీసీ ప్రైజ్ మనీ(రూ.19.50+కోట్లు)తో పోలిస్తే ఇది దాదాపు మూడింతలు ఎక్కువ కావడం గమనార్హం.

News March 20, 2025

బెట్టింగ్ యాప్స్ వ్యవహారం.. టాప్ సెలబ్రిటీలపై కేసు

image

TG: బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన సెలబ్రిటీలపై మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. విజయ్ దేవరకొండ, రానా, ప్రకాశ్ రాజ్, ప్రణీత, మంచు లక్ష్మి, నిధి అగర్వాల్, అనన్య నాగళ్లతో పాటు 18 మంది ఇన్‌ఫ్లుయెన్సర్లపై కేసు నమోదైంది. వీరిలో శ్రీముఖి, సిరి, వర్షిణి, వాసంతి, శోభా శెట్టి, అమృత, పావని, నేహ, పండు, పద్మావతి, ఇమ్రాన్ ఖాన్, విష్ణుప్రియ, హర్షసాయి, సన్నీ యాదవ్, శ్యామల, టేస్టీ తేజ, రఘు, సుప్రీత ఉన్నారు.

error: Content is protected !!